PM Kisan : బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ రూ. 2వేలు పడేది ఎప్పుడంటే? లబ్ధిదారుడి స్టేటస్ ఎలా చెక్ చేయాలి? స్టెప్ బై స్టెప్..!

PM Kisan : పీఎం కిసాన్ రైతులు రెడీగా ఉండండి.. వచ్చే నెలలో పీఎం కిసాన్ 20వ విడత డబ్బులు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది..

PM Kisan 20th Installment

PM Kisan Yojana 20th installment : పీఎం కిసాన్ రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan ) కింద అర్హత కలిగిన రైతులు ఏటా రూ. 6వేలు ఆర్థిక సాయం పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) ద్వారా 3 విడతలుగా రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేస్తోంది.

Read Also : Split AC Offers : బాబోయ్.. ఏంటి ఎండలు.. ఈ టాప్ బ్రాండ్ ఏసీలపై దుమ్మురేపే డిస్కౌంట్లు.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి..!

ప్రతి విడతకు రూ. 2వేలు చొప్పున అందిస్తుంది. రాబోయే పీఎం కిసాన్ 20వ విడత (pm kisan 20th installment) కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇంతకీ పీఎం కిసాన్ డబ్బులు ఎవరికి అందుతాయి? లబ్దిదారుడి స్టేటస్ ఎలా చెక్ చేయాలి? అనే పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం.

20వ విడత ఎప్పుడు వస్తుంది? :
ఫిబ్రవరి 2025లో పీఎం కిసాన్ యోజన 19వ విడత విడుదలైంది. దాదాపు రూ.22వేల కోట్లు రైతుల బ్యాంకు అకౌంట్లలో బదిలీ అయింది. ప్రతి విడతకు 3 నెలల గ్యాప్ ఉంటుంది. 20వ విడత జూన్ చివరి నాటికి విడుదల కావొచ్చు. దీనిపై ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు.

ప్రతి రైతు ఈ-కేవైసీ పూర్తి చేయించుకోవడం తప్పనిసరి. లేదంటే రావాల్సిన వాయిదాలు నిలిచిపోతాయి. మార్గదర్శకాల ప్రకారం.. రైతులు (pmkisan.gov.in) పోర్టల్‌లో OTP ఆధారిత ఈ-కేవైసీ చేయవచ్చు. ఆన్‌లైన్ సౌకర్యం లేకపోతే.. సమీపంలోని CSC కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ KYC పొందవచ్చు.

లబ్ధిదారుని స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
• www.pmkisan.gov.in కి వెళ్లండి.
• ‘Know Your Status’ఆప్షన్ క్లిక్ చేయండి.
• రిజిస్ట్రేషన్ నంబర్, captcha ఎంటర్ చేయండి.
• ‘Get Data’పై క్లిక్ చేసిన తర్వాత Status స్క్రీన్‌పై కనిపిస్తుంది.

లబ్ధిదారుల జాబితాలో పేరును ఎలా చెక్ చేయాలి? :

• వెబ్‌సైట్‌లో ‘Beneficiary List’ ట్యాబ్‌ను ఓపెన్ చేయండి.
• రాష్ట్రం, జిల్లా, బ్లాక్, గ్రామ వివరాలను నింపండి.
• ‘Get Report’పై క్లిక్ చేయండి.
• ఫుల్ లిస్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

అర్హతలివే :

• భారతీయ పౌరుడిగా ఉండాలి.
• సాగు భూమి కలిగి ఉండాలి.
• చిన్న, సన్నకారు రైతులు మాత్రమే అర్హులు.
• ప్రభుత్వం లేదా పెన్షన్ పొందేవారు ఈ పథకానికి అర్హులు కారు.

ఎలా అప్లయ్ చేయాలి? :
• (pmkisan.gov.in)కి వెళ్లండి.
• ‘New Farmer Registration’ ట్యాబ్ పై క్లిక్ చేయండి.
• ఆధార్ నంబర్, CAPTCHA, ఇతర వివరాలను నింపండి.
• ఫారమ్‌ను సమర్పించి ఫ్రింట్ తీసుకోండి.

Read Also :  Vivo S30 Series : మతిపోగొట్టే ఫీచర్లతో కొత్త వివో ఫోన్ వచ్చేస్తోందోచ్.. ఈ నెల 29నే లాంచ్.. వివో ప్యాడ్ కూడా..!

పీఎం కిసాన్ యోజనకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలన్నా లేదా సమాచారం ఇవ్వాలనుకుంటే 155261, 011-24300606 హెల్ప్‌లైన్ నంబర్‌లకు కాల్ చేయొచ్చు.