Vivo S30 Series : మతిపోగొట్టే ఫీచర్లతో కొత్త వివో ఫోన్ వచ్చేస్తోందోచ్.. ఈ నెల 29నే లాంచ్.. వివో ప్యాడ్ కూడా..!
Vivo S30 Series : వివో S 30 సిరీస్ వచ్చేస్తోంది. మే 29న ఈ వివో ఫోన్ లాంచ్ కానుంది. వివో S30 సిరీస్‌తో పాటు వివో ప్యాడ్, వివో TWS ఎయిర్ 3 రానున్నాయి.

Vivo S30 Series
Vivo S30 Series : వివో అభిమానులకు గుడ్ న్యూస్.. వివో కంపెనీ నుంచి వివో S30 సిరీస్ (Vivo S30 Series) వస్తోంది. ఈ నెల 29న లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. ఫోన్ డిజైన్, కలర్ ఆప్షన్‌లను కూడా రివీల్ చేసింది.
ఈ వివో సిరీస్ అనేక కీలక ఫీచర్లు కూడా లీక్ అయ్యాయి. ఈ లైనప్‌లో బేస్ వివో S30, వివో S30 ప్రో మినీ వేరియంట్ ఉంటాయి.
కొత్త స్మార్ట్‌ఫోన్‌లతో పాటు వివో ప్యాడ్ 5 టాబ్లెట్, వివో TWS ఎయిర్ 3 ఇయర్‌ఫోన్‌లు, ఇన్‌బిల్ట్ కేబుల్‌తో కూడిన కొత్త పవర్ బ్యాంక్ లాంచ్ కానున్నాయి.
వివో S30, వివో S30 ప్రో మినీ, వివో ప్యాడ్ 5, వివో TWS ఎయిర్ 3తో పాటు లాంచ్ కానున్నాయి. వివో S3, వివో S30 ప్రో మినీ వేరియంట్‌తో సహా వివో S30 సిరీస్ మే 29న భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 7 గంటలకు చైనాలో లాంచ్ అవుతుందని కంపెనీ వెయిబో పోస్ట్‌లో ధృవీకరించింది.
ప్రస్తుతం అధికారిక వివో వెబ్‌సైట్, ఇతర ఇ-కామర్స్ సైట్‌లలో చైనాలో ఈ రెండు వివో ఫోన్లు ప్రీ-రిజర్వేషన్‌కు అందుబాటులో ఉన్నాయి.
వివో S30 సిరీస్ అధికారిక ల్యాండింగ్ పేజీలో బేస్ వివో S30 కోకో బ్లాక్, లెమన్ ఎల్లో, మింట్ గ్రీన్, పీచ్ పౌడర్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ ఫోన్‌లో 50MP సోనీ పెరిస్కోప్ టెలిఫోటో షూటర్, స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 SoC అమర్చి ఉంటాయి.
వివో S30 ప్రో మినీ కూల్‌బెర్రీ పౌడర్ కలర్‌వేతో పాటు, వెనిల్లా వేరియంట్ మాదిరిగానే కోకో బ్లాక్, లెమన్ ఎల్లో, మింట్ గ్రీన్ షేడ్స్‌లో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.31-అంగుళాల కాంపాక్ట్, ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తుంది.
వివో S30 స్మార్ట్‌ఫోన్ 6.67-అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లేతో వస్తుందని వివో పేర్కొంది. ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు ఒక్కొక్కటి 6,500mAh బ్యాటరీ కలిగి ఉన్నాయి.
రెండు మోడళ్లలో “ఏవియేషన్-గ్రేడ్ అల్యూమినియం మెటల్ మిడిల్ ఫ్రేమ్” ఉంటాయని కంపెనీ వెల్లడించింది. మీడియాటెక్ డైమన్షిటీ 9300+ చిప్‌సెట్‌తో వివో Pad 5 టాబ్లెట్ , వివో S30 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు లాంచ్ కానుంది.
అంతేకాదు.. వివో TWS ఎయిర్ 3 ఇయర్‌ఫోన్‌లు కూడా వస్తాయి. మొత్తం బ్యాటరీ లైఫ్ 45 గంటల వరకు అందిస్తుంది. ప్రతి ఇయర్‌బడ్ బరువు దాదాపు 3.6 గ్రాములు ఉంటుంది. ఇన్‌బిల్ట్ కేబుల్‌తో 33W పవర్ బ్యాంక్ కూడా అందిస్తుంది.