e-Vitara Car : మోదీ జెండా ఊపి ప్రారంభించిన ఈ-విటారా.. 100కు పైగా దేశాలకు ఎగుమతి చేసే ఈ కార్ రేటు..!

e-Vitara Car : మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇ-విటారా కారును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు.

e-Vitara Car

e-Vitara Car : మారుతి సుజుకి వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారత మార్కెట్లోకి మారుతి సుజుకి నుంచి మొట్టమొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఇ-విటారా కారు (e-Vitara Car) వచ్చేసింది. రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారు ‘మారుతి ఇ విటారా’ను జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా, అహ్మదాబాద్‌లోని హన్సల్‌పూర్ ప్లాంట్‌లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్‌ల లోకల్ ప్లాంట్ కూడా ఆయన ప్రారంభించారు. మారుతి సుజుకి ఈ ఎలక్ట్రిక్ SUV ఉత్పత్తి ప్రారంభమైంది. ఈ ప్లాంట్ లో తయారైన ఇ-విటారా ఈవీ కార్లు జపాన్, యూరప్‌తో సహా ప్రపంచంలోని 100కి పైగా దేశాలకు ఎగుమతి కానున్నాయి.

బ్యాటరీకి సంబంధించి తోషిబా, డెన్సో, సుజుకి జాయింట్ వెంచర్ TDS లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంట్‌లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్‌ల స్థానిక ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. ఈ ప్లాంట్ నుంచి ఇప్పుడు 80 శాతానికి పైగా బ్యాటరీలను దేశీయంగా తయారు చేయవచ్చు.

మారుతి సుజుకి 2026 ఆర్థిక సంవత్సరంలో 67వేల ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఎక్కువ భాగం ఎగుమతి చేస్తోంది. ప్రపంచ స్థాయిలో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తుల స్థానాన్ని మరింత బలోపేతం చేస్తోంది.

e-Vitara Car : ఈ మారుతి ప్లాంట్ విస్తీర్ణం ఎంతంటే? :

హన్సల్‌పూర్‌లోని సుజుకి మోటార్ గుజరాత్ (SMG) ప్లాంట్ 640 ఎకరాల్లో విస్తరించి ఉంది. వార్షిక ఉత్పత్తి సామర్థ్యం సుమారు 7.5 లక్షల యూనిట్లు. కొత్త అసెంబ్లీ లైన్ తర్వాత మరింత పెరుగుతుంది. ఈ 3 ప్రొడక్షన్ లైన్ ప్లాంట్‌ను ఇటీవలే సుజుకి మోటార్ కార్పొరేషన్ నుంచి మారుతి సుజుకి కొనుగోలు చేసింది. ఈ దశాబ్దం చివరి నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేసి 4 మిలియన్ కార్లకు పెంచాలని మారుతి సుజుకి ప్రణాళికను ప్రకటించింది.

Read Also : Zero GST : హెల్త్ ఇన్సూరెన్స్ పై జీరో జీఎస్టీ? వచ్చే నెలలో తేలిపోనుంది.. ఏయే వస్తువులు చౌకగా దొరకనున్నాయంటే? ఫుల్ డిటెయిల్స్..

దేశీయ, ఎగుమతి మార్కెట్ల కోసం హన్సల్‌పూర్ ప్లాంట్ మార్చి 2014లో ప్రారంభమైంది. మారుతి సుజుకి బాలెనోను మొదట ఇక్కడే తయారుచేసింది. ఆ తరువాత నెక్స్ట్ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌ను జనవరి 2018లో ఆవిష్కరించింది.

ఇప్పుడు మారుతి మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు మారుతి ఇ-విటారా కూడా ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతుంది. భారత్ మాత్రమే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాలకు కూడా ఎగుమతి చేయనుంది. ఇప్పటివరకు ముంద్రా పోర్టు సమీపంలోని ఈ ప్లాంట్ నుంచి యూరప్, ఆఫ్రికా, జపాన్‌లకు వాహనాలు ఎగుమతి చేస్తోంది.

e-Vitara Car : మారుతి ఇ-విటారా స్పెషిఫికేషన్లు :

కొత్త మారుతి ఇ-విటారా స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే.. లుక్-డిజైన్, సైజు గత ఏడాది మోడల్ మారుతి EVX పోలి ఉంటుంది. అయితే, కొన్ని షార్ప్ యాంగిల్స్ తగ్గించింది. ఫ్రంట్, బ్యాక్ సైడ్ ట్రై-స్లాష్ LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఫ్రంట్ ఎడ్జ్‌లో ఛార్జింగ్ పోర్ట్‌లు, వెనుక చక్రాల ఆర్చ్‌పై కర్వడ్ లైన్ కలిగి ఉంది. దీని వెనుక డోర్ హ్యాండిల్ సి-పిల్లర్‌కు మార్చింది. ప్రస్తుత రోజుల్లో ఇదే ట్రెండ్‌ నడుస్తోంది.

18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో ఇ విటారా పొడవు 4,275 మిమీ, వెడల్పు 1,800 మిమీ, ఎత్తు 1,635 మిమీ. వీల్‌బేస్ 2,700 మిమీ ఉంటుంది. క్రెటా కన్నా కొంచెం పొడవుగా ఉంటుంది. ఈ పెద్ద వీల్‌బేస్ కారు లోపల బ్యాటరీ ప్యాక్‌ను ఇన్‌స్టాల్ చేయొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ 180 మిమీ ఉంటుంది. భారతీయ రోడ్ పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. ఈ కారు మొత్తం బరువు వేరియంట్‌ను బట్టి 1,702 కిలోల నుంచి 1,899 కిలోల వరకు ఉంటుంది.

బ్యాటరీ ప్యాక్, రేంజ్ :
మారుతి ఇ విటారా లిథియం ఐరన్-ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీ ప్యాక్‌ కలిగి ఉంది. కంపెనీ ఈ SUV కారును రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లతో (49kWh, 61kWh) అందిస్తోంది. పెద్ద బ్యాటరీ ప్యాక్‌లో డ్యూయల్-మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సెటప్ ఉంది. ఈ ఎస్‌యూవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల కన్నా ఎక్కువ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ మారుతికి అతిపెద్ద సవాలుగా మారుతుంది. క్రెటా ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో వస్తుంది. ఇందులో 42kWh, 51.4kWh బ్యాటరీ ఉన్నాయి.

ఇ-విటారా ధర ఎంతంటే? :
ఈ రెండు బ్యాటరీ ప్యాక్‌లు వరుసగా 390 కి.మీ, 473 కి.మీ రేంజ్‌తో వస్తాయి. క్రెటా ఎలక్ట్రిక్ ధర రూ. 17.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 24.38 లక్షల వరకు ఉంటుంది. మారుతి ఇ-విటారా ప్రారంభ ధర రూ. 17 లక్షల నుంచి టాప్ వేరియంట్ రూ. 22.50 లక్షల మధ్య ఉంటుంది. టాటా నెక్సాన్ ఈవీ, MG విండ్సర్ వంటి కార్లతో పోటీ పడనుంది.