PNB Minimum Balance
PNB Minimum Balance : పంజాబ్ బ్యాంకు కస్టమర్లకు గుడ్ న్యూస్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో మీకు సేవింగ్స్ అకౌంట్ ఉంటే ఇది మీకోసమే.. కోట్లాది మంది ఖాతాదారులకు (PNB Minimum Balance) భారీ ఉపశమనం కలిగించింది.
సేవింగ్స్ అకౌంట్ కస్టమర్లందరి అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ (MAB) మెయింటైన్ చేయనందుకు విధించే పెనాల్టీని PNB మాఫీ చేసింది. ఈ కొత్త రూల్ బ్యాంక్ జూలై 1, 2025 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. పీఎన్‌బీ సేవింగ్స్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా ఎలాంటి పెనాల్టీ పడదు.
తక్కువ ఆదాయం ఉన్నవారికి రిలీఫ్ :
ఆర్థికంగా కస్టమర్లను మరింత పుంజుకునేందుకు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు PNB ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా మహిళలు, రైతులు, తక్కువ ఆదాయ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బ్యాంకు కస్టమర్లు కనీస బ్యాలెన్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
Read Also : Jio offer : పండగ చేస్కోండి.. ఈ జియో చీపెస్ట్ ప్లాన్లతో అన్‌లిమిటెడ్ హైస్పీడ్ డేటా.. జస్ట్ రూ.19 నుంచి..!
కరెంట్ అకౌంట్ కస్టమర్లు డోంట్ వర్రీ :
కస్టమర్లపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించే దిశగా బ్యాంకింగ్ సర్వీసులను మరింత సులభతరం చేస్తోంది. సేవింగ్స్ అకౌంట్లు ఉన్న కస్టమర్లకు మాత్రమే ఈ సౌకర్యాన్ని పొందగలరు. కరెంట్ అకౌంట్లు ఉన్న కస్టమర్లు ఎలాంటి ఆందోళన అవసరం లేదు.
ఎడ్యుకేషన్ లోన్‌పై వడ్డీ తగ్గింపు :
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) విద్యాలక్ష్మి యోజన కింద అందించే ఎడ్యుకేషన్ లోన్‌పై వడ్డీ రేటును 0.2 శాతం తగ్గించింది. విద్యార్థుల విద్య కోసం ఆర్థిక సాయం అందించడానికి విద్యాలక్ష్మి యోజన పథకం అందుబాటులో ఉంది. ఎడ్యుకేషన్ లోన్ అనేది ఫైనాన్స్ సంస్థలను బట్టి 7.5 శాతం నుంచి వడ్డీ రేటు అందుబాటులో ఉంటుంది.