Jio offer : పండగ చేస్కోండి.. ఈ జియో చీపెస్ట్ ప్లాన్లతో అన్‌లిమిటెడ్ హైస్పీడ్ డేటా.. జస్ట్ రూ.19 నుంచి..!
Jio offer : రిలయన్స్ జియో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు అత్యంత సరసమైన ధరకే హైస్పీడ్ అన్ లిమిటెడ్ డేటా ప్లాన్లను ఆఫర్ చేస్తోంది.

Jio offer
Jio offer : జియో యూజర్లకు పండగే.. జియో అతి చౌకైన ధరకే అద్భుతమైన డేటా ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. డేటా యాడ్-ఆన్ ప్యాక్ సరసమైన ధరకే అందుబాటులో ఉన్నాయి. రూ.70 కన్నా (Jio offer) తక్కువ ధరలో డేటా ప్యాక్‌లను పొందవచ్చు.
జియో యూజర్లు రోజువారీ డేటాను రోజువారీ, నెలవారీ వ్యాలిడిటీతో పొందవచ్చు. ఇంతకీ ఏయే డేటా ప్లాన్లు ఎంత ధరతో అందుబాటులో ఉన్నాయో ఓసారి వివరంగా తెలుసుకుందాం..
రూ. 69 డేటా ప్యాక్ :
జియో ఈ డేటా ప్యాక్ 7 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మీరు ఇంటర్నెట్ వినియోగం కోసం మొత్తం 6GB డేటాను పొందవచ్చు.
రూ.62 ప్లాన్ :
జియో ఫోన్ డేటా యాడ్-ఆన్ ప్యాక్. మొత్తం 6GB డేటాను పొందవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు.
రూ. 49 డేటా ప్యాక్ :
జియో ఈ డేటా ప్యాక్ ఒక రోజు వ్యాలిడిటీతో అందిస్తుంది. కంపెనీ తమ వినియోగదారులకు అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తోంది.
రూ. 29 డేటా ప్యాక్ :
ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు బెస్ట్ డేటా ప్యాక్. కంపెనీ రెండు రోజుల వ్యాలిడిటీతో పాటు 2GB డేటాను కూడా అందిస్తోంది.
రూ. 26 డేటా ప్యాక్ :
Reliance Jio జియో ఫోన్ డేటా యాడ్-ఆన్ ప్యాక్. ఇందులో కంపెనీ 28 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 2GB డేటాను అందిస్తోంది.
రూ. 19 డేటా ప్యాక్ :
ఈ డేటా ప్యాక్ ఒక రోజు వ్యాలిడిటీతో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఇంటర్నెట్ వినియోగానికి 1GB డేటాను పొందవచ్చు.