Google Pixel 9 Pro Fold : పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ కావాలా? ఈ మడతబెట్టే ఫోన్ ధర ఎంత తగ్గిందో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

Google Pixel 9 Pro Fold : గూగుల్ పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ చూశారా? ఈ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ధర భారీగా తగ్గింది.. తక్కువ ధరకే ఎలా కొనాలంటే?

Google Pixel 9 Pro Fold : పిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ కావాలా? ఈ మడతబెట్టే ఫోన్ ధర ఎంత తగ్గిందో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు..!

Google Pixel 9 Pro Fold

Updated On : July 2, 2025 / 12:46 PM IST

Google Pixel 9 Pro Fold : పిక్సెల్ ఫోన్ కొంటున్నారా? గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ధర భారీగా తగ్గింది. ఈ మడతబెట్టే ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ హై-ఎండ్ ఫోల్డబుల్ (Google Pixel 9 Pro Fold) స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ. 30వేల వరకు భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

ఫ్లిప్‌కార్ట్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ధర రూ.1,72,999కు లాంచ్ అయింది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోల్డబుల్ ఫోన్‌పై రూ.20వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది. అసలు ధర నుంచి రూ.1,52,999కు తగ్గింది. మీరు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐపై అదనంగా రూ.10వేలు తగ్గింపు పొందవచ్చు. ఎక్కువ సేవింగ్ చేయాలంటే.. పాత స్మార్ట్‌ఫోన్‌ కూడా ట్రేడ్ చేయవచ్చు.

పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ 1080×2424 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల OLED ఔటర్ ప్యానెల్‌ను కలిగి ఉంది. అదనపు మన్నిక కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది. లోపలి డిస్‌ప్లే 8 అంగుళాలు, 120Hz రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్‌లో టెన్సర్ G4 చిప్‌సెట్ కలిగి ఉంది.

Read Also : Nothing Phone 3 : కొత్త నథింగ్ ఫోన్ 3 వచ్చేసిందోచ్.. ఏఐ ఫీచర్లు అదుర్స్.. బ్యాంకు ఆఫర్లు, ధర ఎంతంటే?

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఈ ఫోల్డబుల్ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. OISతో 48MP మెయిన్ సెన్సార్, 10.5MP అల్ట్రావైడ్ లెన్స్, 10.8MP టెలిఫోటో కెమెరా. బయటి, లోపలి స్క్రీన్‌లు రెండూ 10MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాతో వచ్చాయి.

ఈ ఫోల్డ్ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్, 4650mAh బ్యాటరీతో వస్తుంది. ఏఐ-ఆధారిత ఫీచర్లలో యాడ్ మీ, ఆటో ఫ్రేమ్, కొత్త పిక్సెల్ వెదర్ యాప్, మ్యాజిక్ లిస్ట్, స్క్రీన్‌షాట్ యాప్, పిక్సెల్ స్టూడియో, క్లియర్ కాలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.