Nothing Phone 3 : కొత్త నథింగ్ ఫోన్ 3 వచ్చేసిందోచ్.. ఏఐ ఫీచర్లు అదుర్స్.. బ్యాంకు ఆఫర్లు, ధర ఎంతంటే?

Nothing Phone 3 : కొత్త నథింగ్ ఫోన్ కోసం చూస్తున్నారా? 5550mAh బ్యాటరీతో పాటు స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్ వంటి ఫీచర్లు ఉన్నాయి..

Nothing Phone 3 : కొత్త నథింగ్ ఫోన్ 3 వచ్చేసిందోచ్.. ఏఐ ఫీచర్లు అదుర్స్.. బ్యాంకు ఆఫర్లు, ధర ఎంతంటే?

Nothing Phone 3

Updated On : July 2, 2025 / 11:56 AM IST

Nothing Phone 3 : కొత్త ఫోన్ కొంటున్నారా? లండన్‌కు టెక్ బ్రాండ్ నథింగ్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ (3) లాంచ్ చేసింది. ఈసారి బ్రాండ్ డిజైన్‌లో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ లెవల్స్ పరంగా (Nothing Phone 3) అనేక ఆకర్షణీయమైన మార్పులతో తీసుకొచ్చింది.

నథింగ్ ఫోన్ (3) స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 ప్రాసెసర్, గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ 2.0, పవర్‌ఫుల్ కెమెరా ఫీచర్లతో వస్తుంది. పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి. మెరుగైన కెమెరా ఫీచర్లు, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ, ఆకర్షణీయమైన LED నోటిఫికేషన్ లైట్లతో వస్తుంది.

నథింగ్ ఫోన్ (3) డిజైన్, డిస్‌ప్లే :
నథింగ్ ఫోన్ 3 డిజైన్ గత వెర్షన్ల మాదిరిగానే ట్రాన్సపరంట్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంది. కొత్త గ్లైఫ్ ఇంటర్‌ఫేస్ 2.0తో వస్తుంది. నోటిఫికేషన్ కంట్రోల్ ఇండికేషన్లు, కస్టమ్ లైట్ పాట్రన్స్ అందిస్తుంది. 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+కు సపోర్టు ఇస్తుంది. ఏఐ ప్రాసెసింగ్, గేమింగ్, మల్టీ టాస్కింగ్‌ అందిస్తుంది. 12GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజీ ఆప్షన్లను కలిగి ఉంది.

నథింగ్ ఫోన్ 3 స్పెసిఫికేషన్లు :
నథింగ్ ఫోన్ 3 మోడల్ 120hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్‌తో 6.67-అంగుళాల అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ అందిస్తుంది. 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌తో వస్తుంది. 16GB ర్యామ్, 512GB స్టోరేజీతో వస్తుంది.

Read Also : PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత.. అకౌంటులో రూ.2వేలు పడగానే అలర్ట్ వస్తుంది.. మీ మొబైల్ నెంబర్ ఇలా అప్‌డేట్ చేసుకోండి..!

65W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 7.5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 5,500mAh బ్యాటరీని అందిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత నథింగ్ OS 3.5పై రన్ అవుతుంది. 5 ఏళ్ల OS, 7 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌ కూడా అందిస్తుంది. IP68 సర్టిఫికేషన్‌ కూడా కలిగి ఉంది.

కెమెరాల విషయానికొస్తే.. ఈ నథింగ్ ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా సెన్సార్‌, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ కెమెరా, 50MP అల్ట్రావైడ్ కెమెరాను పొందుతుంది. ఫ్రంట్ సైడ్ ఈ డివైజ్ EISతో కూడిన 50MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. గ్లిఫ్ విషయానికి వస్తే.. ఈ నథింగ్ ఫోన్ మైక్రో LED, ఎసెన్షియల్ నోటిఫికేషన్లు, వాల్యూమ్ ఇండికేటర్, ఫ్లిప్ టు గ్లిఫ్, బెడ్‌టైమ్ షెడ్యూల్, కెమెరా కౌంట్‌డౌన్, గ్లిఫ్ టార్చ్, గ్లిఫ్ టాయ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.

భారత్‌లో నథింగ్ ఫోన్ 3 ధర, ఆఫర్లు :
నథింగ్ ఫోన్ 3 మోడల్ మొత్తం 2 వేరియంట్లలో లభిస్తుంది. 12GB/256GB రూ.79,999కి, 16GB/512GB రూ.89,999కి లభ్యమవుతుంది. అన్ని ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్ల తర్వాత కస్టమర్లు 12GB ర్యామ్ వేరియంట్‌ను రూ.62,999కి పొందవచ్చు. టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.72,999కు అందుబాటులో ఉంది. ఈ నథింగ్ ఫోన్ జూలై 15 నుంచి లభ్యం అవుతుంది.