PM Kisan : పీఎం కిసాన్ 20వ విడత.. అకౌంటులో రూ.2వేలు పడగానే అలర్ట్ వస్తుంది.. మీ మొబైల్ నెంబర్ ఇలా అప్‌డేట్ చేసుకోండి..!
PM Kisan : పీఎం కిసాన్ రైతులు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS అలర్ట్ అందుకుంటారు. మీ మొబైల్ నెంబర్ యాక్టివ్ లేకపోతే అప్ డేట్ చేసుకోండి..

PM Kisan 20th installment
PM Kisan 20th Installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు పీఎం కిసాన్ 20వ విడత డబ్బుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ జూలైలో (PM Kisan) పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan Samman Nidhi) 20వ విడత విడుదల కానుంది.
అర్హత కలిగిన రైతులు ప్రతి 4 నెలలకు రూ. 2,000 చొప్పున మొత్తం ఏటా రూ. 6,000 చొప్పున డబ్బులు విడుదల అవుతాయి. ఏప్రిల్-జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి నెలలో అందుకుంటారు. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.
ఈసారి రూ. 2వేలు డబ్బులు పడేందుకు ముందుగానే రైతులు తమ డాక్యుమెంట్లు, ఇతర వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి. OTP-ఆధార్ ధృవీకరణ కూడా చాలా ముఖ్యం. అందుకే లబ్ధిదారు రైతులు తమ మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాలి.
పీఎం కిసాన్ పోర్టల్ లేదా ఆఫ్‌లైన్ CSC సెంటర్ విజిట్ చేయడం ద్వారా రైతులు తమ మొబైల్ నంబర్‌ను ఈజీగా అప్‌డేట్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్ పోయినట్లయితే లేదా ప్రస్తుతం యాక్టివ్‌గా లేకుంటే.. కొత్త నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. ఇంతకీ మొబైల్ నంబర్‌ను ఎలా అప్‌డేట్ చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మీ మొబైల్ నంబర్ ఎలా అప్‌డేట్ చేయాలి? :
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in)కి వెళ్లండి.
- హోమ్‌పేజీలో కిందికి స్క్రోల్ చేసి ‘Update Mobile Number’పై క్లిక్ చేయాలి.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి ‘Search’పై ట్యాప్ చేయండి.
- మీ ప్రొఫైల్ కనిపించగానే కొత్త మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత Submit బటన్ క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు OTP ద్వారా వెరిఫై చేసుకోవాలి.
- కన్ఫర్మేషన్ కోసం కొత్త నంబర్‌కు OTP వస్తుంది.
- ఆ OTP ఎంటర్ చేస్తే చాలు మొబైల్ నెంబర్ అప్‌డేట్ అవుతుంది.
ఆఫ్‌లైన్ మోడ్‌లో ఎలా అప్‌డేట్ చేయాలి? :
మీ మొబైల్ నంబర్‌ను ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీ ఆధార్ కార్డ్, పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్‌తో మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా మీ స్థానిక వ్యవసాయ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి సిబ్బంది సాయంతో మీ మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేసుకోవచ్చు.
పీఎం కిసాన్ 20వ విడత విడుదల? :
ప్రధానమంత్రి కిసాన్ పథకం 20వ విడతను ప్రధాని మోదీ జూలై 2025లో విడుదల చేస్తారని భావిస్తున్నారు. 19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదల అయింది.
మీ PM-కిసాన్ వాయిదా స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
- ముందుగా అధికారిక వెబ్‌సైట్ (https://pmkisan.gov.in)ని విజిట్ చేయండి.
- ‘Know Your Status’ పై క్లిక్ చేయండి
- మీ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి
- మీ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో చెక్ చేయండి
- మీ eKYC పూర్తయిందో లేదో చెక్ చేయండి.