Post Office Scheme
Post Office Scheme : పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టేందుకు చూస్తున్నారా? మీ బ్యాంకు డిపాజిట్లపై భారీ వడ్డీని సంపాదించుకోవచ్చు. భారత పోస్టల్ శాఖ పథకంలో పెట్టుబడితో అత్యధిక వడ్డీ రేట్లను పొందవచ్చు. అంతేకాదు.. ఆదాయపు పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు.
ఈ పథకంలో చేరడం ద్వారా (Post Office Scheme) లక్షల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెడితే తక్కువ సమయంలో అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తుంది. లక్షల రూపాయలు ఆదా చేస్తుంది. ఈ పథకాన్ని పొందడానికి సబ్-పోస్ట్ ఆఫీస్ లేదా పోస్టాఫీసును సంప్రదించి మీ ఫారమ్‌ను సమర్పించవచ్చు.
NSCలో లక్షల డిపాజిట్.. 7.7శాతం వడ్డీ :
భారత తపాలా శాఖ తక్కువ సమయంలో అధిక వడ్డీ రేట్లను అందించే పథకాన్ని అందిస్తోంది. ఈ పథకాన్ని NSC లేదా నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అంటారు. ఈ డిపాజిట్ 5 ఏళ్లకు స్థిరంగా ఉంటుంది. సుమారు 7.7శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఈ పథకం అతి తక్కువ సమయంలో అత్యధిక వడ్డీ రేట్లను అందిస్తుంది.
Read Also : NPS to UPS Deadline : NPS నుంచి UPSకి ఇంకా మారలేదా? డెడ్‌లైన్ పొడిగించే ఛాన్స్ ఉందా? వన్ షాట్ ఆన్సర్..!
మీరు ఈ పథకంలో రూ. లక్షలు జమ చేస్తే.. రూ. 1.5 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకాన్ని కేవలం వెయ్యి రూపాయలతో ప్రారంభించవచ్చు. ఈ పథకం కింద ఒక వ్యక్తి 5 ఏళ్లపాటు రూ. 10 లక్షల జమ చేస్తే వారికి రూ. 4.49 లక్షల వడ్డీ లభిస్తుంది. అయితే, డిపాజిట్ 5 ఏళ్ల పాటు స్థిరంగా ఉంటుంది. ఈ అకౌంట్ నుంచి డబ్బులను విత్‌డ్రా చేసుకోలేరు.
ఈ డాక్యుమెంట్లు అవసరం :
ఈ పథకాన్ని పొందాలంటే ఏదైనా సబ్-పోస్టాఫీస్ లేదా మెయిన్ పోస్టాఫీసును సంప్రదించవచ్చు. ఈ పథకం అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులు ఇద్దరూ సులభంగా అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ రెండు పాస్‌ఫొటోలు అవసరం. మీరు అకౌంటులో రూ.1,000 నుంచి రూ. లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. అత్యధిక వడ్డీ రేట్లను కూడా పొందవచ్చు.