Post Office Scheme
Post Office Scheme : మీ జీతం పడిందా? అయితే, ఇది మీకోసమే.. జీతం డబ్బులను సేవ్ చేసుకోండి. ఎందుకంటే.. ఇప్పుడు సేవ్ చేసిన డబ్బులే మీకు అత్యవసర (Post Office Scheme) సమయాల్లో ఉపయోగపడతాయి. మీకోసం లేదా మీ పిల్లల కోసమైనా లేదా భార్యాభర్తలిద్దరూ కలిసి కూడా పెట్టుబడి పెట్టవచ్చు.
అయితే, ఎందులో పెట్టుబడి పెట్టాలా? అని ఆలోచిస్తున్నారా? మీకోసం పోస్టాఫీస్ అద్భుతమైన పథకాలను అందిస్తోంది. ఈ సురక్షితమైన పథకాల ద్వారా భారీగా రాబడిని పొందవచ్చు. మీరు ఏ పథకంలో డబ్బు పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం వస్తుందో ముందుగా తెలుసుకోవాలి.
ప్రతి నెలా రూ. 6వేలు పొందే పథకం విషయానికి వస్తే.. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) ఉంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఇంట్లో కూర్చొని ప్రతి నెలా రూ. 6వేలు ఆదాయాన్ని పొందవచ్చు. మీరు చిన్నవారైనా లేదా పెద్దవారైనా ఈ పథకం ప్రయోజనాలను పొందవచ్చు.
సింగిల్ డిపాజిట్.. ప్రతి నెలా స్థిర వడ్డీ :
ఈ పథకంలో ఒక్కసారి మాత్రమే డబ్బు డిపాజిట్ చేయాలి. ఆపై మీకు 5 ఏళ్ల పాటు ప్రతి నెలా స్థిర వడ్డీ లభిస్తుంది. ఈ ప్రభుత్వ పథకంలో పెట్టుబడితో మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. మీ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి ఆధార్ కార్డు, సేవింగ్స్ అకౌంట్ వివరాలు వంటి అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించండి.
మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం ఉండదు. మీరు మీ భాగస్వామితో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ప్రతి ఏడాదిలో లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు. అలాగే, పెట్టుబడి పెట్టే ముందు ఆర్థిక నిపుణులను ఓసారి సంప్రదించండి.
ఈ పథకంలో మీరు సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మీరు సింగిల్ ఖాతాలో గరిష్టంగా రూ. 9 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. అయితే, మీరు జాయింట్ అకౌంటులో రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. అక్టోబర్ 1, 2023 నుంచి ఈ పథకం 7.4శాతం వార్షిక వడ్డీని పొందుతోంది.
మీరు జాయింట్ అకౌంటులో రూ. 10 లక్షలు డిపాజిట్ చేస్తే.. నెలకు రూ. 6,167 లేదా ఏడాదికి రూ. 74,004 సంపాదిస్తారు. ఈ డబ్బు ప్రతి నెలా మీ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌కు వస్తూనే ఉంటుంది. అకౌంట్ ఓపెన్ చేయడానికి కనీసం రూ. 1,000 డిపాజిట్ చేయాలి. ఆ తర్వాత మీరు అవసరమైనంత వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
పిల్లల పేరుతో అకౌంట్ తీసుకోవచ్చు :
ఈ పోస్టాఫీసు పథకం ముఖ్యంగా రిటైర్మెంట్ అయినవారికి చాలా మంచిది. మీకు రెగ్యులర్ ఆదాయం లేని సమయంలో ఈ POMIS పథకం ద్వారా నెలవారీగా ఆదాయం పొందవచ్చు. ఈ పథకాన్ని మీ పిల్లల పేరుతో కూడా ఓపెన్ చేయొచ్చు.
పిల్లల వయస్సు 10 ఏళ్ల కన్నా తక్కువ ఉంటే.. తల్లిదండ్రులు లేదా గార్డియన్స్ వారి పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. 10 ఏళ్ల వయస్సు తర్వాత మీ పిల్లలే అకౌంట్ స్వయంగా ఆపరేట్ చేయొచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ 5 ఏళ్లు ఉంటుంది. కానీ, మీరు కోరుకుంటే మరో 5 ఏళ్లు పొడిగించవచ్చు.
మీరు మధ్యలో డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. కానీ, కొన్ని నిబంధనలు ఉన్నాయి. మీరు అకౌంట్ ఓపెన్ చేసిన ఏడాది తర్వాత డబ్బును విత్‌డ్రా చేస్తే 2 శాతం తగ్గుతుంది. మీరు 3 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీకి ముందు విత్‌డ్రా చేసుకుంటే ఒక శాతం తగ్గుతుంది. రిస్క్ లేని స్థిర ఆదాయాన్ని కోరుకునే వారికి ఈ పథకం బెస్ట్. మీతో పాటు మీ భార్య కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. తద్వారా ఎక్కువ మొత్తంలో సంపాదించుకోవచ్చు.