Post Office Scheme
Post Office Scheme : పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? మీ తల్లిదండ్రుల పేరుతో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇదే అద్భుతమైన పథకం.. మీ పేరెంట్స్ 60 ఏళ్లు పైబడిన వారు అయితే వెంటనే పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టేయండి. తద్వారా కేవలం వడ్డీనే నెలకు రూ. 5,500 వరకు సంపాదించుకోవచ్చు.
ప్రస్తుత రోజుల్లో చాలామంది డబ్బు ఆదా (Post Office Scheme) చేయాలని అనుకుంటారు. కానీ, కొంతమంది మాత్రమే తమ సంపాదనలో కొంత మొత్తాన్ని సేవ్ చేయగలరు. డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యం. మీరు కష్టపడి సంపాదించిన ఆదాయాన్ని పెట్టుబడి పెట్టేందుకు సరైన మార్గాన్ని ఎంచుకోండి. స్టాక్ మార్కెట్ అయితే భారీగా నష్టాలను ఎదుర్కోవాల్సి రావొచ్చు.
నెలవారీ ఆదాయ పథకం (MIS) ఏంటి? :
బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లతో తక్కువ రాబడి మాత్రమే అందిస్తాయి. భారీ వడ్డీతో పాటు సెక్యూరిటీ పరంగా చూస్తే పోస్టాఫీస్ పథకాలు చాలా బెస్ట్.. పోస్టాఫీసు అందించే పథకాల్లో నెలవారీ ఆదాయ పథకం (MIS) కూడా ఒకటి. ఈ పథకంలో మీరు ఒకేసారి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కేవలం రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. తద్వారా మీరు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్థిర నెలవారీ వడ్డీని పొందవచ్చు.
ఈ పథకం ఎవరికి బెస్ట్ అంటే? :
మీరు పోస్టాఫీసులో ఒకేసారి మొత్తాన్ని డిపాజిట్ చేయొచ్చు. వడ్డీ నెలవారీగా లెక్కిస్తారు. మీ పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంటులో వడ్డీ డిపాజిట్ అవుతుంది. మరో మాటలో చెప్పాలంటే.. ప్రతి నెలా స్థిరమైన గ్యారెంటీ ఆదాయం లభిస్తుంది. ఈ పథకం ముఖ్యంగా రిస్క్ లేని పెట్టుబడులకు అద్భుతంగా ఉంటుంది. అలాగే, రిటైర్మెంట్ అయిన సీనియర్ సిటిజన్లు, పెన్షనర్లు, గృహిణులకు ఈ పథకం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
Read Also : OnePlus 13 Price : మాస్ మిరాకిల్ ఆఫర్.. వన్‌ప్లస్ 13 ఇంత తక్కువ ధరకే వస్తుంటే కొనకుండా ఉండలేరు..!
పెట్టుబడి పెట్టడం ద్వారా పెన్షన్ ఫండ్స్ స్థిరమైన నెలవారీ రాబడిని పొందవచ్చు. మీరు కనీసం రూ.1,000 డిపాజిట్‌తో ప్రారంభించవచ్చు. సింగిల్ అకౌంట్ రూ.9 లక్షల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే, జాయింట్ అకౌంట్ రూ.15 లక్షల వరకు గరిష్టంగా ముగ్గురు ఖాతాదారులతో పెట్టుబడి పెట్టేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఈ MIS పథకం ద్వారా వార్షిక వడ్డీ రేటు 7.4శాతం అందిస్తోంది. రూ. 9 లక్షల సింగిల్ అకౌంట్ డిపాజిట్ ద్వారా నెలకు రూ. 5,550 ఆదాయం లభిస్తుంది.
గరిష్టంగా రూ. 15 లక్షల జాయింట్ అకౌంట్ డిపాజిట్ ద్వారా నెలకు రూ. 9,250 ఆదాయం లభిస్తుంది. ఈ పథకంలో కాలపరిమితి 5 ఏళ్లు ఉంటుంది. ఈ సమయంలో అసలు మొత్తం లాక్ అయి ఉంటుంది. మీరు నెలవారీ వడ్డీని మాత్రమే పొందుతారు. ఈ పథకంలో పెట్టుబడితో ఎలాంటి పన్ను ప్రయోజనాలను అందించదు. వాస్తవానికి, పోస్టాఫీసు పథకాలు వంద శాతం సెక్యూరిటీ గ్యారెంటీ కలిగి ఉంటాయి. ఎందుకంటే ఈ పథకాలన్నీ నేరుగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తాయి.
మీ పెట్టుబడి పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. పోస్టాఫీసులో నెలవారీ ఆదాయ పథకం (MIS) అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. మీరు ముందుగా పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి. ఇప్పటికే అకౌంట్ లేకపోతే ఆధార్, అడ్రస్ ప్రూఫ్, పాస్ ఫొటోలు వంటి కేవైసీ డాక్యుమెంట్లతో అప్లికేషన్ ఫారమ్‌తో పాటు సమర్పించి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.