OnePlus 13 Price : మాస్ మిరాకిల్ ఆఫర్.. వన్‌ప్లస్ 13 ఇంత తక్కువ ధరకే వస్తుంటే కొనకుండా ఉండలేరు..!

OnePlus 13 Price : మీరు వన్‌ప్లస్ అభిమానులు అయితే మీకోసం వన్‌ప్లస్ 13 ధర భారీ తగ్గింపుతో లభ్యమవుతోంది. ఈ క్రేజీ డిస్కౌంట్ ఇలా సొంతం చేసుకోండి.

1/5OnePlus 13 Price
OnePlus 13 Price : కొత్తగా వన్‌ప్లస్ 15 వచ్చేసింది.. ఇప్పుడు వన్‌ప్లస్ 13 ధర కూడా భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ ఈ వన్‌ప్లస్ ఫోన్‌పై క్రేజీ డిస్కౌంట్ అందిస్తోంది. వన్‌ప్లస్ 13 ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. 256GB ఇంటర్నల్ స్టోరేజ్, వన్‌ప్లస్ 13 మోడల్ 12GB ర్యామ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.62,489 ధరకు అందుబాటులో ఉంది. అసలు ధర రూ.69,999 నుంచి తగ్గింది.
2/5OnePlus 13 Price
ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లందరూ వన్‌ప్లస్ ఫోన్‌పై రూ.4వేలు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. దాంతో ధర రూ.58,489కి తగ్గుతుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ మిడ్‌నైట్ ఓషన్, బ్లాక్ ఎక్లిప్స్ అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మీరు కూడా ఈ వన్‌ప్లస్ 13 ఫోన్ కొనాలని చూస్తుంటే అసలు మిస్ చేసుకోవద్దు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
3/5OnePlus 13 Price
వన్‌ప్లస్ 13 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : వన్‌ప్లస్ 13 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌, అడ్రినో 830 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌తో వస్తుంది. ఏదైనా సాఫ్ట్‌వేర్‌ రన్ చేయగలదు. మల్టీ-టాస్కింగ్‌ కూడా అద్భుతంగా ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.82-అంగుళాల ఎల్టీపీఓ 4.1 అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఈ ఫోన్ వన్‌ప్లస్ 4 మెయిన్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి ఉంటుంది.
4/5OnePlus 13 Price
వన్‌ప్లస్ 13లో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50MP ప్రైమరీ షూటర్, 120 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో షూటర్ ఉన్నాయి.
5/5OnePlus 13 Price
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం హ్యాండ్‌సెట్ 32MP ఫ్రంట్ స్నాపర్‌ కూడా కలిగి ఉంది. 6000mAh బ్యాటరీతో పాటు 100W వైర్డు, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.