Post Office Schemes : పోస్టాఫీస్‌‌లో అద్భుతమైన స్కీమ్స్.. ఇందులో మీ డబ్బు డిపాజిట్ చేస్తే.. బ్యాంకుల్లో కన్నా భారీ వడ్డీ వస్తుంది..!

Post Office Schemes : పోస్టాఫీసులో మీ డబ్బును డిపాజిట్ చేస్తే కేవలం 5 ఏళ్లలో ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? బ్యాంకుల్లో కన్నా అధిక వడ్డీని పొందవచ్చు. పోస్టాఫీసు అందించే వడ్డీల వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Post Office Schemes

Post Office Saving Schemes : మీ డబ్బు పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారా? ఎందులో పెట్టుబడితే అధిక రాబడి వస్తుందా? అని ఆలోచిస్తున్నారా? అయితే, మీకోసం పోస్టాఫీసులో అద్భుతమైన స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు పోస్టాఫీసులో మీ డబ్బును పెట్టుబడిగా పెడితే భవిష్యత్తులో మీకు బ్యాంకుల్లో కన్నా భారీ వడ్డీలను పొందవచ్చు.

ప్రధానంగా పోస్టాఫీసులో సేవింగ్స్ అకౌంట్లు, FD అకౌంట్లు, RD అకౌంట్లు వంటి సేవింగ్స్ అకౌంట్లు ఉంటాయి. ఈ అకౌంట్లు బ్యాంకుల్లోనే కాకుండా పోస్టాఫీసులలో కూడా ఓపెన్ చేయొచ్చు. పోస్టాఫీసు తమ కస్టమర్లకు బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీని అందిస్తుంది.

Read Also : Samsung Galaxy A26 5G : గుడ్ న్యూస్.. AI ఫీచర్లతో కొత్త శాంసంగ్ 5జీ ఫోన్ భలే ఉందిగా.. లాంచ్‌కు ముందే ధర ఎంతో తెలిసిందోచ్..!

పోస్టాఫీసు అందించే అద్భుతమైన పథకాలు ఉన్నాయి. ఈ పథకాలతో మీరు బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీని పొందవచ్చు.. మీ డబ్బుకు ప్రభుత్వం నుంచి పూర్తి భద్రత కూడా ఉంటుంది. పోస్టాఫీసు అందించే పథకాల్లో టైమ్ డిపాజిట్ (TD) పథకం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఏడాది నుంచి 5 ఏళ్ల వరకు అకౌంట్ ఓపెన్ :
పోస్టాఫీసు TD పథకం అనేది బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వంటిది. మీరు TD అకౌంట్‌‌లో ఒకేసారి ఒక పెద్ద మొత్తాన్ని డిపాజిట్ చేస్తారు. దానిపై మీకు భారీగా వడ్డీ లభిస్తుంది. పోస్టాఫీసులో మీరు 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలకు TD అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.

వివిధ కాలపరిమితితో ఈ TD అకౌంట్లపై పోస్టాఫీసు వరుసగా 6.9 శాతం, 7.0 శాతం, 7.1 శాతం, 7.5 శాతం వడ్డీ రేట్లను అందిస్తోంది. 5 ఏళ్ల TDపై పోస్టాఫీసు అత్యధిక వడ్డీ రేటు 7.5 శాతంగా అందిస్తోంది. టీడీ అకౌంట్ కేవలం రూ. 1000తో ఓపెన్ చేయొచ్చు. అయితే, అందులో గరిష్ట డిపాజిట్ పరిమితి లేదు. మీకు కావలసినంత డబ్బును డిపాజిట్ చేయవచ్చు.

Read Also : Vivo X200 Ultra : వారెవ్వా.. కొత్త వివో X200 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..!

రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే.. రూ. 2.25 లక్షల వడ్డీ :
మీరు పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ (TD) పథకంలో రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో మీకు మొత్తం రూ. 7,24,974 లక్షల డబ్బులు చేతికి అందుతాయి. ఇందులో మీరు డిపాజిట్ చేసిన రూ. 5లక్షలతో పాటు రూ. 2,24,974 నికర, స్థిర వడ్డీ కూడా ఉంటుంది. పోస్టాఫీసు టీడీ పథకంలో మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. పోస్టాఫీసులో మీరు జమ చేసే ప్రతి పైసా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.