Vivo X200 Ultra : వారెవ్వా.. కొత్త వివో X200 అల్ట్రా ఫోన్ వచ్చేస్తోంది.. కీలక ఫీచర్లు లీక్.. ధర ఎంతో తెలిస్తే షాకవుతారు..!
Vivo X200 Ultra Launch : వివో X200 అల్ట్రా ఫోన్ వచ్చే నెలలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ డిస్‌ప్లే, కెమెరా, బ్యాటరీ స్పెసిఫికేషన్లతో పాటు కెమెరా టెక్నాలజీలకి సంబంధించి ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.

Vivo X200 Ultra Launch
Vivo X200 Ultra Launch : వివో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో చైనాలో వివో కొత్త X200 అల్ట్రా ఫోన్ లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ అల్ట్రా ఫోన్ గురించి అనేక కొత్త లీక్‌లు బయటకు వచ్చాయి. ఈ ఫోన్ ముఖ్య ఫీచర్లు కూడా లీక్ అయ్యాయి.
టిప్‌స్టర్ ప్రకారం.. వివో X200 అల్ట్రా డిస్‌ప్లే, కెమెరా సెటప్, బ్యాటరీ వంటి వివరాలతో సహా కొన్ని స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. వివో స్మార్ట్‌ఫోన్ కెమెరా టెక్నాలజీలో అద్భుతంగా ఉంది. ఈ అప్‌గ్రేడ్స్ వివో X200 అల్ట్రా ఫోన్ హార్డ్‌వేర్‌తో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
ప్రాసెసర్, పర్ఫార్మెన్స్ :
వివో X200 అల్ట్రా ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను ఉపయోగిస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌లతో వస్తుంది. ఈ రేంజ్ ప్రాసెసర్ ఉండటం వల్ల అద్భుతమైన పర్ఫార్మెన్స్, మల్టీ టాస్కింగ్ కెపాసిటీని అందించనుంది.
కెమెరా సిస్టమ్ :
కెమెరా ప్రియుల కోసం వివో X200 అల్ట్రా అద్భుతమైన కెమెరా ఫీచర్‌ను అందించనుంది. ఈ ఫోన్‌లో వివో X200 ప్రో మాదిరిగానే f/2.27 అపెర్చర్ 85mm, శాంసంగ్ ISOCELL HP9 టెలికెమెరా ఉండవచ్చు.
ఈ ఫోన్‌లో సోనీ LYT-818 సెన్సార్‌లను ప్రైమరీ, అల్ట్రావైడ్ కెమెరాలుగా అందించే అవకాశం ఉందని లీక్ డేటా సూచిస్తోంది. మెయిన్ కెమెరాలో 1.5x క్రాప్ ఉండవచ్చు. f/1.69 అపెర్చర్‌తో 35mm సమానమైన లెన్స్ ఉండవచ్చు. ఈ రెండింటితో తక్కువ లైటింగ్‌లో కూడా అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు.
డిస్‌ప్లే, ఫీచర్లు :
డిస్‌ప్లే విషయానికి వస్తే.. కచ్చితమైన సమాచారం లేదు. వివో X200 అల్ట్రా గత మోడళ్ల డిజైన్ మాదిరిగా సన్నని బెజెల్స్‌తో భారీ స్క్రీన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. వివో X200 ప్రో, వివో X100 అల్ట్రా రెండూ 6.78-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉన్నాయి. వివో X200 ప్రో కూడా భారీ స్క్రీన్-టు-బాడీ రేషియోను కలిగి ఉంది. అందుకే రాబోయే వివో X200 అల్ట్రా కూడా అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందించనుంది.
ధర (అంచనా) :
వివో X200 అల్ట్రా, వివో X200 ప్రో కన్నా చాలా ఖరీదైనదిగా ఉండే అవకాశం ఉంది. ఈ రెండు ఫోన్లను కంపేర్ చేస్తే.. వివో X100 అల్ట్రా చైనాలో CNY 6,499 (సుమారు రూ.78వేలు) ధరకు లాంచ్ అయింది. వివో X100 ప్రో CNY 4,999 (సుమారు రూ. 60వేలు) ధరకు లాంచ్ అయింది. వివో X200 అల్ట్రా మోడల్ వివో పోర్ట్‌ఫోలియోలో అద్భుతమైన ఆఫర్ అందించే అవకాశం ఉంది.
లాంచ్ తేదీ (అంచనా) :
భారత మార్కెట్లో వివో X200 Ultra ఫోన్ లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు. అయితే, వివో X200 ప్రోకి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లో వివో X200 Ultra అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వివో ఇండియా ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
డిజైన్ :
ఎర్గోనామిక్ ఫోకస్ ప్రకారం.. వివో X200 అల్ట్రా డిజైన్ సన్నగా ఉండాలి. క్వాలిటీ మెటేరియల్స్‌తో రూపొందించాలి. అయితే, ఈ వివో ఫోన్ వాటర్, డస్ట్ నిరోధకతను కలిగి ఉంది. రోజువారీ వినియోగానికి సరిగ్గా సరిపోతుంది.