Airtel IPL Offer : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. క్రికెట్ ప్రియుల కోసం అద్భుతమైన ప్లాన్.. IPL మ్యాచ్‌లను లైవ్‌లోనే చూడొచ్చు!

Airtel IPL Offer : క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్ అందిస్తోంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా హాట్‌స్టార్ సబ్‌స్ర్కిప్షన్ ఉచితంగా పొందవచ్చు. సరసమైన ధరలో మరెన్నో డేటా, OTT బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.

Airtel IPL Offer : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. క్రికెట్ ప్రియుల కోసం అద్భుతమైన ప్లాన్.. IPL మ్యాచ్‌లను లైవ్‌లోనే చూడొచ్చు!

Airtel IPL Offer

Updated On : March 23, 2025 / 11:23 AM IST

Airtel IPL Offer : ఐపీఎల్ ప్రియుల కోసం దేశీయ రెండో అతిపెద్ద టెలికాం ప్రొవైడర్ ఎయిర్‌టెల్ అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. IPL 2025 కన్నా ముందే రూ.301 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

Read Also : DGGI Block Websites : ఐపీఎల్‌కు ముందే బెట్టింగ్ రాయుళ్లకు బిగ్ షాక్.. 357 ఆన్‌‌లైన్ గేమింగ్స్ వెబ్‌సైట్లు, 2400 బ్యాంకు అకౌంట్లు బ్లాక్.. కోట్ల నగదు స్వాధీనం!

ఎయిర్‌టెల్ తమ కస్టమర్ల అవసరాలను తీర్చడానికి ఎప్పటికప్పుడూ సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెడుతుంది. ఈ లేటెస్ట్ రూ. 301 ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా, SMS, ఫ్రీగా OTT సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. క్రికెట్ ప్రియులకు అద్భుతమైన ప్లాన్ అని చెప్పవచ్చు.

ఎయిర్‌టెల్ రూ.301 ప్లాన్ :
ఐపీఎల్ అభిమానుల కోసం ఎయిర్‌టెల్ సరికొత్త రూ. 301 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రత్యేకంగా అందిస్తోంది. డేటా, కాలింగ్, ఎంటర్‌టైన్మెంట్ బెనిఫిట్స్ అందిస్తుంది.
అన్‌లిమిటెడ్ కాలింగ్ : భారత్ అంతటా ఏ నెట్‌వర్క్‌కైనా ఫ్రీ కాల్స్ చేయండి.
వ్యాలిడిటీ : రోజువారీ ఫ్రీ SMS బెనిఫిట్స్
రోజుకు 1GB డేటా : 28 రోజుల పాటు మొత్తం 28GB డేటా.
డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ : IPL 2025, ఇతర ఎంటర్‌టైన్మెంట్ కంటెంట్‌ 3 నెలల పాటు ఫ్రీ యాక్సెస్‌
ఫ్రీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌తో ఐపీఎల్ మ్యాచ్‌లను లైవ్‌లోనే చూడొచ్చు.

ఐపీఎల్ అభిమానులను దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌ను రూపొందించింది. ఈ ప్లాన్‌లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది. దీని కోసం ఎయిర్‌‌టెల్ యూజర్లు ఎలాంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన పనిలేదు. అన్ని IPL మ్యాచ్‌లను లైవ్‌లోనే చూడొచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు ఉండగా, హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ 3 నెలల పాటు యాక్సస్ చేయొచ్చు.

ఎయిర్‌టెల్ ఇతర ప్లాన్లు ఇవే :
ఇటీవలే ఎయిర్‌టెల్ బడ్జెట్ ఫ్రెండ్లీ డేటా, కాలింగ్ బెనిఫిట్స్‌తో రూ.100, రూ.195 ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. అయితే, రూ.301 ప్లాన్ రోజువారీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు OTT సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది.

Read Also : Jio IPL Plan : వావ్ వండర్‌ఫుల్.. ఈ జియో ప్లాన్‌తో IPL మ్యాచ్‌లు 3 నెలలు ఫ్రీగా చూడొచ్చు.. మరెన్నో OTT బెనిఫిట్స్ కూడా!

ఎయిర్‌టెల్ రూ. 301 ప్లాన్ బెనిఫిట్స్ ఏంటి? :
నెలవారీ ప్రీపెయిడ్ ప్లాన్ కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్ బెటర్.. OTT బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లాన్ రోజువారీ డేటాను అందిస్తుంది. క్రికెట్ ప్రియులు IPL 2025 లైవ్ స్ట్రీమింగ్‌ను మిస్ కాకుండా చూడవచ్చు.