Post Office Schemes
Post Office Schemes : పెట్టుబడి పెడదామని అనుకుంటున్నారా? అయితే, ఎందులో పెట్టుబడి పెడితే అధిక రాబడి పొందవచ్చు.. ఏయే పథకాల్లో అధిక (Post Office Schemes) ప్రయోజనాలు ఉంటాయో తెలుసా? వాస్తవానికి, బ్యాంకుల కన్నా పోస్టాఫీస్ పథకాలే ఎక్కువ వడ్డీని ఇస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడికి ఈ పోస్టాఫీసు పథకాలు చాలా బెస్ట్.. మంచి రాబడిని అందించే సేవింగ్స్ స్కీమ్ కోసం చూస్తుంటే పోస్టాఫీసు పథకాల్లో పెట్టుబడి పెట్టవచ్చు.
ప్రస్తుతం పోస్టాఫీస్ అందించే పథకాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. గ్యారెంటీ రాబడిని అందించే పథకాలు ఉన్నాయి. మీరు బ్యాంకుల్లో FD (ఫిక్స్ డ్ డిపాజిట్లు) కన్నా ఎక్కువ వడ్డీని పొందవచ్చు. ఈ పథకాలలో పెట్టుబడి ద్వారా పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. పోస్టాఫీసు పథకాలకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయ పథకం :
మీరు బ్యాంకు కన్నా ఎక్కువ రాబడిని పొందాలనుకుంటే పోస్టాఫీస్ నెలవారీ ఆదాయ పథకంలో చేరండి. ఈ పథకంలో, మీరు ప్రతి నెలా 7.4శాతం వార్షిక వడ్డీని పొందవచ్చు. మీ అకౌంటులోనే వడ్డీ మొత్తం వస్తుంది. ఈ పథకంలో 5 ఏళ్ల పాటు లాకింగ్ పీరియడ్ ఉంటుంది. మీరు సింగిల్ అకౌంట్ నుంచి గరిష్టంగా రూ. 9 లక్షలు, జాయింట్ అకౌంట్ నుంచి రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ :
రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా లోటు లేకుండా జీవించాలనుకుంటే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ తీసుకోవచ్చు. మీరు జమ చేసిన డబ్బుపై మంచి రాబడిని పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్‌లో సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అద్భుతమైన పథకం. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు ఈ పథకంలో చేరవచ్చు. 8.2శాతం వార్షిక వడ్డీ రేటును పొందవచ్చు. ప్రతి త్రైమాసికంలో మీ అకౌంటులో వడ్డీ క్రెడిట్ అవుతుంది. ఈ పథకంలో పన్ను మినహాయింపు కూడా ఉంది.
రికరింగ్ డిపాజిట్ పథకం :
పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం కూడా చాలా అద్భుతమైన పథకం.. ప్రతి నెలా కొంచెం ఆదా చేసిన మొత్తాన్ని సురక్షితంగా సేవింగ్ చేయాలనుకునేవారికి చాలా మంచిది. జూలై-సెప్టెంబర్ 2025 త్రైమాసికంలో 6.7శాతం వార్షిక వడ్డీ పొందవచ్చు. అంటే.. నెలకు కేవలం రూ. 100తో ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.
సుకన్య సమృద్ధి పథకం :
సుకన్య సమృద్ధి యోజన కూడా పోస్టాఫీసు అందించే పథకాల్లో ఒకటి. కుమార్తె భవిష్యత్తు కోసం సురక్షితమైన రాబడిని కోరుకునే వారికి బెస్ట్. ప్రస్తుతం ఈ పథకంలో పెట్టుబడిపై 8.2శాతం వార్షిక వడ్డీని పొందవచ్చు. బ్యాంకుల FD, ఇతర సేవింగ్స్ పథకాల కన్నా చాలా ఎక్కువ.
మీ కూతురు పేరు మీద అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సంవత్సరానికి రూ. 250 నుంచి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. మీ కుమార్తెకు 21 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు లేదా వివాహం అయినప్పుడు మెచ్యూరిటీ పొందవచ్చు.
కిసాన్ వికాస్ పత్ర :
మీ డబ్బును రెట్టింపు చేసుకోవచ్చు. పోస్టాఫీసు పథకం కిసాన్ వికాస్ పత్రలో మీ డబ్బును దాదాపు 115 నెలల్లో అంటే.. తొమ్మిదిన్నర సంవత్సరాలలో రెట్టింపు చేసుకోవచ్చు. ప్రస్తుతం, వార్షిక వడ్డీని 7.5శాతం అందిస్తోంది. ఈ పథకంలో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు.