ముఖేశ్ అంబానీ 13 బిలియన్ డాలర్ల డీల్ వెనుక ఉన్న ఆ రెయిన్ మేకర్ ఇతడే?

  • Publish Date - June 12, 2020 / 09:28 AM IST

ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత బిలియనీర్ ముఖేశ్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరిస్తున్నారు. ముఖేశ్ వ్యాపార సామ్రాజ్యంలో తన వెన్నంటి ఉంటూ నమ్మిన బంటులా ఆయన అంతర్గత వ్యవహారాలు చూసుకుంటున్న ఓ వ్యక్తి పేరు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అంబానీ రైట్ హ్యాండ్‌గా పిలుచుకునే అతడికి చెప్పుకోవడానికి మెరిసే బిరుదులు లేవు. భారతదేశంలో చాలా కొద్దిమందికి మాత్రమే ఈయన పేరు తెలిసి ఉండొచ్చు. ఇంతకీ ఆయన పేరు ఏంటో తెలుసా? మనోజ్ మోడీ. ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేశ్ అంబానీ కార్పొరేట్ సామ్రాజ్యం వెనుక అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఈయన ఒకరు. భారతీయ వ్యాపార ప్రపంచంలో చాలామంది అంతర్గత వ్యక్తులు, ఇతరులు బిలియనీర్లలో కొంతమందికి మాత్రమే మనోజ్ మోడీ గురించి తెలుసు. 

అంబానీ రైట్ హ్యాండ్‌గా పిలుస్తుంటారు. ఏప్రిల్ నెలలో ఫేస్ బుక్ ఇంక్‌తో 5.7 బిలియన్ డాలర్ల ఒప్పందం కోసం చర్చలు జరిగాయి. ఈ చర్చల సందర్భంగా మనోజ్ మోడీ కీలక పాత్ర పోషించారు. 63ఏళ్ల ముఖేశ్ అంబానీ తన విస్తారమైన వ్యాపారంపై దృష్టిని పెట్రో కెమికల్స్ నుంచి ఇంటర్నెట్ టెక్నాలజీకి మారడంలో మనోజ్ వెనుక నుంచి కీలకంగా వ్యవహరించారు.

గ్రూపులో ఫేస్ బుక్ పెట్టుబడి జియో ప్లాట్ ఫామ్ ల తర్వాత ప్రైవేటు-ఈక్విటీ ఫండ్స్ నుంచి పలు ఒప్పందాలు జరిగాయి. అంబానీ వ్యాపారంలో 13 బిలియన్ డాలర్ల డీల్ కుదర్చడంలో అంతర్గతంగా మనోజ్ పాత్ర కీలకమని చెప్పవచ్చు. ఈయన వ్యక్తిగత జీవితం గురించి ప్రజా రంగానికి చాలా తక్కువగా తెలుసు. అరుదుగా ఇంటర్వ్యూలు ఇస్తారు. కార్పొరేట్ రాజవంశాలతో దీర్ఘకాల సంబంధాలున్న భారతదేశంలో అంతగా తెలియని ప్రభావవంతంగా వ్యక్తుల్లో ఒకరిగా చెప్పవచ్చు. 

టెక్నాలజీ పరిశ్రమలో అరడజనుకు పైగా అధికారులు, రిలయన్స్‌తో లావాదేవీలు జరిపారు. కఠినమైన బేరసారాలు నడిపినందుకు మోడీకి ఖ్యాతి గడించారు. స్టార్టప్‌లతో వ్యవహరించే సమయంలో అతను తరచూ తెరవెనుక నుంచి చర్చలను కంట్రోల్ చేస్తుంటారు. ఎగ్జిక్యూటివ్‌లను దిశా నిర్దేశాలను సూచిస్తూనే డీల్ కుదుర్చడంలో ఈయన సాటి లేరనే చెప్పాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి బ్లాక్‌చెయిన్ వరకు కొత్త టెక్నాలజీలలో నైపుణ్యాన్ని పెంపొందించింది. ప్రతి ఒప్పందంలో మోడీదే చివరి మాటగా ఉంటుందని నలుగురు వేర్వేరు స్టార్టప్ వ్యవస్థాపకులు ఇంటర్వ్యూలలో చెప్పారు.

1980 నుంచి అంబానీ తండ్రి చమురు, పెట్రోకెమికల్స్ దిగ్గజంను నిర్మిస్తున్నప్పటి నుంచి కంపెనీతో కలిసి ఉన్న కొద్దిమందిలో మోడీ ఒకరిగా ఉన్నారు. కొన్ని ఏళ్ల క్రితం, మనోజ్ హర్జీవాండాస్ మోడీ, అంబానీ ముంబైలోని యూనివర్శిటీ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో చదువుకున్నారు. అక్కడే వీరిద్దరూ స్నేహితులయ్యారు. అప్పటినుంచి అంబానీకి రైట్ హ్యాండ్ గా ఉంటూ రిలయన్స్ విజయాల్లో తెర వెనుక ఉండి నడిపిస్తున్నారు. ఫేస్ బుక్ ఒప్పందం కోసం చర్చల సందర్భంగా.. అంబానీ, ఆయన పిల్లలు ఇషా, ఆకాష్ తో పాటు మనోజ్ మోడీ చర్చల్లో కీలకంగా వ్యవహరించారని తెలిసిన వ్యక్తులలో ఒకరు చెప్పారు. 

Read:ఈ 19 చిన్న నేరాలకు శిక్షవద్దు!