Raksha Bandhan 2025 : రక్షాబంధన్ రోజున మీ సోదరి పేరుతో ఇలా పెట్టుబడి పెట్టండి.. ఇదే మీరు ఇచ్చే లైఫ్ లాంగ్ గిఫ్ట్..!

Raksha Bandhan 2025 : రక్షాబంధన్ నాడు మీ సోదరికి మీరు ఇచ్చే బహుమతి వారి జీవితానికి ఆర్థికంగా ప్రయోజనాన్ని అందించేదిగా ఉండాలి.

Raksha Bandhan 2025 : రక్షాబంధన్ రోజున మీ సోదరి పేరుతో ఇలా పెట్టుబడి పెట్టండి.. ఇదే మీరు ఇచ్చే లైఫ్ లాంగ్ గిఫ్ట్..!

Raksha Bandhan 2025

Updated On : August 8, 2025 / 4:10 PM IST

Raksha Bandhan 2025 : రక్షా బంధన్ అనేది సోదరులకు సోదరీమణులు రాఖీ కట్టే సంప్రదాయం.. ఈ పండుగ రోజున రాఖీ కట్టిన సోదరికి సోదరులు ఎన్నో రకాల (Raksha Bandhan 2025) బహుమతులు ఇచ్చి సర్ ప్రైజ్ చేస్తుంటారు. సాధారణంగా చాలామంది ఆభరణాలు, బట్టలు లేదా హ్యాంపర్లు బహుమతిగా ఇస్తుంటారు. ఇలాంటి అప్పటివరకూ ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి కానీ, భవిష్యత్తు పరంగా ఆర్థికపరంగా ఎలాంటి భద్రతను ఇవ్వలేవు.

ఈ రక్షా బంధన్ సందర్భంగా మీరు కూడా మీ సోదరీమణులకు ఆర్థికపరమైన బహుమతులను ఇవ్వాలని అనుకుంటున్నారా? ప్రతి రక్షాబంధన్ రోజున తమ సోదరీమణులకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను అందించే బహుమతులను ఇవ్వొచ్చు. తద్వారా వారి ఆర్థిక జీవితం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది.

అంతేకాదు.. సోదరీమణులకు ఇండిపెండెన్సీ, సేఫ్టీతో కాలక్రమేణా ఆస్తులను సంపాదించుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ నుండి గోల్డ్ ఈటిఎఫ్, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వరకు భారీగా సంపాదించుకోవచ్చు. ఇంతకీ ఏయే పెట్టుబడులతో ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

1. సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (SIP) :
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. SIP ద్వారా ప్రతి నెలా చిన్న మొత్తాల్లో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. మార్కెట్-లింక్డ్ ఫండ్స్ హెచ్చుతగ్గుదల ఉంటుంది. అయినప్పటికీ దీర్ఘకాలిక పెట్టుబడులకు అద్భుతమైన ప్లాన్.

రాఖీ పండగ రోజున మీ సోదరి పేరు మీద ఈక్విటీ లేదా హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్‌లో SIPని మొదలుపెట్టవచ్చు. HDFC బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్, ICICI ప్రుడెన్షియల్ బ్లూచిప్ ఫండ్ లేదా పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉన్నాయి.

2. హెల్త్ ఇన్సూరెన్స్ :
ఆరోగ్యం, అత్యవసర పరిస్థితుల్లో ఆర్థికంగా బలంగా ఉండాలి. మీ సోదరికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని బహుమతిగా ఇవ్వొచ్చు. కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవచ్చు లేదా ఇప్పటికే ఉన్న పాలసీకి ప్రీమియం చెల్లించవచ్చు.

వైద్య ఖర్చులతో పాటు ఆరోగ్య సంక్షోభ సమయాల్లో మీ సోదరిని ఆర్థికంగా ఆదుకోవచ్చు. ఆమె వయస్సుతో పాటు ముందస్తు అనారోగ్య సమస్యలను బట్టి మీరు NivaBupa, HDFC ERGO లేదా స్టార్ హెల్త్ వంటి బీమా సంస్థల నుంచి మంచి పాలసీలను ఎంచుకోవచ్చు.

Read Also : Rakshabandhan 2025 : రాఖీ కట్టేందుకు వెళ్తున్నారా? సోదరీమణులకు ఫ్రీగా బస్ సర్వీసులు.. ఏయే రాష్ట్రాల్లో ఎన్ని రోజులు ప్రయాణించవచ్చంటే?

3. సేవింగ్స్, డీమ్యాట్ అకౌంట్ :
మీ సోదరి కోసం ఆమె పేరుతో సేవింగ్స్ అకౌంట్ లేదా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. సేవింగ్స్ అకౌంట్ డబ్బుతో పాటు వడ్డీని కూడా పొందవచ్చు. అయితే, డీమ్యాట్ అకౌంట్ స్టాక్‌లు, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్ డిజిటల్‌గా మార్చుకోవచ్చు.

IDFC ఫస్ట్, కోటక్ మహీంద్రా లేదా AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వంటి బ్యాంకుల నుంచి జీరో-బ్యాలెన్స్ అధిక వడ్డీ అందించే సేవింగ్స్ అకౌంట్లను ఎంచుకోండి. డీమ్యాట్ అకౌంట్ కోసం Zerodha, Groww లేదా Upstox వంటి ప్లాట్‌ఫారమ్‌లను ఎంచుకోవచ్చు.

4. డిజిటల్ గోల్డ్ :
రక్షా బంధన్ రోజున గోల్డ్ గిఫ్ట్ ఇవ్వడం అనేది సంప్రదాయం. నేటి యుగంలో డిజిటల్ గోల్డ్ కూడా అంతే. పాక్షిక యూనిట్లలో గోల్డ్ కొనుగోలు చేయొచ్చు. చాలా సేఫ్ కూడా. ఫిజికల్ గోల్డ్ తీసుకోవచ్చు లేదా డిజిటల్‌గా అమ్ముకోవచ్చు. స్వచ్ఛత, సేఫ్టీ, మేకింగ్ ఛార్జీలు ఉండనే ఉండవు. సేఫ్‌గోల్డ్, MMTC-PAMP, Paytm గోల్డ్ వంటి ప్లాట్‌ఫామ్‌లు మొబైల్ యాప్‌ల ద్వారా నేరుగా రూ. 100తో డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసి సోదరికి గిఫ్ట్ ఇవ్వొచ్చు.

5. గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) :
గోల్డ్ ఈటీఎఫ్స్ అనేవి ఫిజికల్ గోల్డ్ వంటివే. బంగారంలో పెట్టుబడి పెట్టే మ్యూచువల్ ఫండ్ యూనిట్లు, స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడ్ అవుతాయి. జ్యూయెలరీలా కాకుండా గోల్డ్ ఈటీఎఫ్స్ ఎలాంటి మేకింగ్ ఛార్జీలు ఉండవు. హై లిక్విడిటీని అందిస్తాయి. గోల్డ్ ధరకే లభిస్తాయి.

ఇలాంటి గోల్డ్ ఫండ్స్ ఆసక్తిగల సోదరీమణులకు సరైన బహుమతి. మీరు నిప్పాన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్, ఎస్‌బీఐ గోల్డ్ ఈటీఎఫ్ లేదా హెచ్‌డీఎఫ్‌సీ గోల్డ్ ఈటీఎఫ్ వంటి గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి యూనిట్లను గిఫ్ట్ ఇవ్వవచ్చు.

6. గ్రీన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు :
మీ సోదరీమణులకు గ్రీన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను బహుమతిగా ఇవ్వొచ్చు. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్లు పర్యావరణ అనుకూల లోన్ ప్రాజెక్టులకు లింక్ అయి ఉంటాయి. సాంప్రదాయ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కన్నా కొంచెం తక్కువ రాబడిని అందిస్తాయి. కానీ, వడ్డీ మాత్రమే కోరుకునేవారికి బెస్ట్. HDFC, ICICI బ్యాంకులు, బజాజ్ ఫైనాన్స్ వంటి నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ఎంపిక చేసిన టర్మ్ పీరియడ్‌లో గ్రీన్ FD ఆప్షన్లను అందిస్తున్నాయి.

7. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు :
మీరు ప్రొఫెషనల్ ఫండ్ కోసం చూస్తుంటే మ్యూచువల్ ఫండ్లు బెస్ట్. స్వల్పకాలిక సేవింగ్స్ నుంచి దీర్ఘకాలిక రాబడి వరకు అనేక అవసరాలను తీరుస్తాయి. మీ సోదరి కోసం ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ లేదా థీమాటిక్ మ్యూచువల్ ఫండ్ల నుంచి ఎంచుకోవచ్చు.

కొన్ని పాపులర్ ఫండ్ ఆప్షన్లలో యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ (ELSS), SBI స్మాల్ క్యాప్ ఫండ్ లేదా ఎడెల్వీస్ బ్యాలెన్స్‌డ్ అడ్వాంటేజ్ ఫండ్ ఉన్నాయి. మీరు SIP ద్వారా కూడా పెట్టుబడి పెట్టవచ్చు. రాఖీ బహుమతిగా మీ సోదరి కోసం ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు.

8. స్టాక్స్, ఈక్విటీ షేర్లు :
రక్షాబంధన్ కోసం గిఫ్ట్ బాక్స్‌లు ఇచ్చే బదులుగా స్టాక్స్, ఈక్విటీ షేర్లు బహుమతులుగా ఇవ్వొచ్చు. చాలామందికి స్టాక్ మార్కెట్లపై పెద్దగా ఆసక్తి ఉండదు. ఒకవేళ మార్కెట్లపై సోదరీమణులకు అవగాహన ఉంటే స్టాక్‌లను బహుమతిగా ఇవ్వొచ్చు. పాపులర్ కంపెనీల కొన్ని షేర్లను వారి పేరుతో కొనుగోలు చేయొచ్చు. దీర్ఘకాలంల ఆయా షేర్లు పెరగొచ్చు.

TCS, HUL, HDFC బ్యాంక్ వంటి బ్లూ-చిప్ స్టాక్‌లను ఎంచుకోవచ్చు. బ్యూటీ, ఫ్యాషన్ లేదా టెక్ అంశాలపై ఆసక్తి ఉంటే ఇలాంటి స్టాక్‌లను బహుమతిగా ఇవ్వొచ్చు. మీ సోదరి డీమ్యాట్ ఖాతాకు షేర్లను కూడా ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. ఈ రక్షా బంధన్‌ రోజున మీ సోదరిని పెట్టుబడి పెట్టాలని ప్రోత్సహించవచ్చు. తద్వారా భవిష్యత్తులో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేని జీవితాన్ని అందించవచ్చు.