Rakshabandhan 2025 : రాఖీ కట్టేందుకు వెళ్తున్నారా? సోదరీమణులకు ఫ్రీగా బస్ సర్వీసులు.. ఏయే రాష్ట్రాల్లో ఎన్ని రోజులు ప్రయాణించవచ్చంటే?

Rakshabandhan 2025 : రక్షాబంధన్ 2025 పండుగ సందర్భంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తున్నాయి.

Rakshabandhan 2025 : రాఖీ కట్టేందుకు వెళ్తున్నారా? సోదరీమణులకు ఫ్రీగా బస్ సర్వీసులు.. ఏయే రాష్ట్రాల్లో ఎన్ని రోజులు ప్రయాణించవచ్చంటే?

Rakshabandhan 2025

Updated On : August 8, 2025 / 2:57 PM IST

Rakshabandhan 2025 : రక్షాబంధన్ సందర్భంగా మహిళలకు గుడ్ న్యూస్.. రాఖీ పండగ రోజున మీ సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్తున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఆగస్టు 9న దేశవ్యాప్తంగా రక్షా బంధన్ పండుగ జరుపుకుంటారు. ఈ ప్రత్యేక రాఖీ పండగ సందర్భంగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించాయి.

కొన్ని రాష్ట్రాల్లో, ఈ సౌకర్యం రెండు రోజులు అందుబాటులో ఉంటుంది. మరికొన్ని రాష్ట్రాల్లో మహిళలు 3 రోజులు టికెట్ లేకుండా ప్రయాణించవచ్చు. ఇంతకీ ఏయే రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ఎన్ని రోజులు ప్రయాణించవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

యూపీలో 3 రోజులు ఉచిత బస్సు ప్రయాణం :
రక్షా బంధన్ సందర్భంగా ఉత్తరప్రదేశ్ రవాణా సంస్థ మహిళా ప్రయాణికులకు ప్రత్యేక బహుమతిని అందించింది. ఆగస్టు 9 శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 11 ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు మహిళలు రోడ్‌వేస్‌లోని అన్ని ఏసీ, నాన్-ఏసీ బస్సులలో ఒక సహ ప్రయాణీకుడితో (మహిళ లేదా పురుషుడు) ఉచితంగా ప్రయాణించగలరు. ఈ కాలంలో, రవాణా సంస్థ 986 బస్సులను నడుపుతోంది. 50 అదనపు బస్సులను రిజర్వ్‌లో ఉంచింది.

Read Also : Airtel Best Plans : పండగ చేస్కోండి.. ఎయిర్‌టెల్ బెస్ట్ OTT రీఛార్జ్ ప్లాన్లు.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ అన్ని ఫ్రీగా చూడొచ్చు!

ఉత్తరాఖండ్‌లో ఉచిత బస్సు సర్వీసు ఎన్ని రోజులంటే? :
రక్షాబంధన్ సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం సాధారణ రోడ్డు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించింది. రక్షాబంధన్ రోజున ఆగస్టు 9న మహిళలు ఈ ఉచిత సౌకర్యాన్ని పొందవచ్చు.

ఏయే రాష్ట్రాల్లో మహిళలకు ఎన్ని రోజులు ఉచిత బస్సు సౌకర్యమంటే? :
ఉత్తర ప్రదేశ్ : ఆగస్టు 8 నుండి 10 వరకు.. UPSRTC, సిటీ బస్సులలో 3 రోజులు ఉచిత ప్రయాణం.
హర్యానా : ఆగస్టు 8 మధ్యాహ్నం నుంచి ఆగస్టు 9 రాత్రి వరకు 15 ఏళ్ల లోపు బాలికలు, పిల్లలకు రాష్ట్రం లోపల, ఢిల్లీ, చండీగఢ్ వరకు ఉచిత ప్రయాణం
రాజస్థాన్ : ఆగస్టు 9 నుంచి ఆగస్టు 10 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బస్సుల్లో 2 రోజులు ఉచిత ప్రయాణం.
మధ్యప్రదేశ్ : ఆగస్టు 9 నుంచి భోపాల్, ఇండోర్‌లలో సిటీ బస్సులలో ఉచిత ప్రయాణం, రూ. 1,500 బోనస్, రూ. 250 గిఫ్ట్స్ కూడా పొందొచ్చు.
ఉత్తరాఖండ్ : ఆగస్టు 9 నుంచి రాష్ట్ర రవాణా సంస్థ బస్సుల్లో మహిళలు, పిల్లలకు ఉచిత ప్రయాణం.
చండీగఢ్, మొహాలి, పంచకుల ఆగస్టు 9 నుంచి ట్రైసిటీ ప్రాంతంలో పరిమిత ఉచిత బస్సు సర్వీస్
ఢిల్లీ : ఏడాది పొడవునాస్థానిక మహిళలకు DTC బస్సుల్లో ఉచిత ప్రయాణం
పంజాబ్ : ఏడాది పొడవునా అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
కర్ణాటక : ఏడాది పొడవునారాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

బీహార్ ప్రభుత్వం ప్రత్యేక బహుమతి :
రక్షా బంధన్ రోజున బీహార్ ప్రభుత్వం మహిళలకు రోడ్డు ప్రయాణాన్ని ఉచితంగా అందిస్తోంది. పాట్నా, ముజఫర్‌పూర్‌లోని అన్ని మార్గాల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని బీహార్ రవాణా శాఖ తెలిపింది. పాట్నాలో పింక్ బస్సులలో కూడా ఈ ఉచిత సౌకర్యాన్ని మహిళలు పొందవచ్చు.

రాజస్థాన్‌లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం :
రక్షా బంధన్ సందర్భంగా రెండు రోజుల పాటు రాజస్థాన్ ప్రభుత్వం అన్ని రోడ్‌వే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. అయితే, ఈ సౌకర్యం రాజస్థాన్ రాష్ట్ర సరిహద్దుల్లోని ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది.