Ratan Tata : పారిశ్రామికవేత్త రతన్‌ టాటాకు ఉద్యోగ రత్న అవార్డు ..

మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ఉద్యోగ రత్న అవార్డు రతన్ టాటాను వరించింది. సీఎం ఏక్ నాథ్ షిండే,డిప్యూటీ సీఎంలు చేతుల మీదుగా ఉద్యోగ రత్న అవార్డును ప్రధానం చేశారు.

Udyog Ratna Award to Ratan Tata

Udyog Ratna Award to Ratan Tata : ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా (Ratan Tata )కు మహారాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ రత్న అవార్డు(Udyog Ratna award )ను ఇచ్చి సత్కరిచింది. శనివారం (ఆగస్టు 19,2023) సీఎం ఏక్ నాథ్ షిండే (CM Eknath Shinde),డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్(Dy CM Devendra Fadnavis), అజిత్ పవార్ (Dy CM Ajit Pawar)చేతుల మీదుగా ఉద్యోగ రత్న అవార్డును ప్రధానం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొలి ఉద్యోగ రత్న అవార్డు రతన్ టాటాను వరించింది. 85 ఏళ్ల రతన్‌ టాటా ఆరోగ్య సమస్యలతో బాధపడపడుతున్న విషయం తెలిసిందే. దీంతో దక్షి ముంబైలోని రతన్ టాటా ఇంటి వద్దకే వచ్చి అవార్డును సీఎం అందజేశారు. అవార్డుతో పాటు మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MIDC) నుండి శాలువా, ప్రశంసాపత్రం, జ్ఞాపికను అందజేశారు.

Lord Automotive: 8 అధునాతన విద్యుత్ వాహనాలను విడుదల చేసిన లార్డ్స్ ఆటోమేటివ్

ఈ సందర్భంగా సీఎం ఏక్‌నాథ్‌ షిండే మాట్లాడుతూ.. రతన్‌ టాటా, టాటా గ్రూప్స్‌ దేశానికి ఎనలేని సేవలందించాయన్నారని..అన్ని రంగాల్లోను టాటా గ్రూప్ విస్తరించిందని ఎన్నో వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డును స్వీకరించిన రతన్‌ టాటాకు ధన్యవాదాలు తెలిపారు.

కాగా..మహారాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ‘ఉద్యోగ రత్న’ అవార్డును తీసుకువచ్చింది. విశిష్ట వ్యక్తులకు ఇచ్చే మహారాష్ట్ర భూషణ్ అవార్డు మాదిరిగానే రతన్ టాటాను ఉద్యోగ రత్న అవార్డుతో సత్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టాటా గ్రూపు ఆరు ఖండాల్లో 100కిపైగా దేశాల్లో టాటా గ్రూప్ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో టాటా కంపెనీల మొత్తం ఆదాయం 128 బిలియన్ డాలర్లుగా ఉంది.