RBI Alert : మీ ఫోన్లో ఈ లోన్ యాప్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి.. ఆర్‌బీఐ హెచ్చరిక!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రజలను హెచ్చరిస్తోంది. ‘sRide అనే యాప్ వాడే యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ సూచిస్తోంది. ఈ యాప్ వెంటనే డిలీట్ చేయాలని సూచిస్తోంది.

Reserve Bank of India : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రజలను హెచ్చరిస్తోంది. ‘sRide అనే యాప్ వాడే యూజర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ సూచిస్తోంది. అనధికార ప్రీపెయిడ్ పేమెంట్ వాలెట్స్ (PPIs) ఉపయోగించే సమయంలో అత్యంత జాగ్రత్త వహించాలని సూచిస్తోంది. ఈ యాప్ అప్లికేషన్ లేదా ఎంటిటీ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఈ యాప్ మీ మొబైల్లో ఉంటే వెంటనే డిలీట్ చేసేయాలని ఆర్బీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది. sRide టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురుగ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోందని ఆర్బీఐ వెల్లడించింది.

రైడ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్, కార్-పూలింగ్ యాప్ (అప్లికేషన్) sRide ద్వారా సెమీ-క్లోజ్డ్ (నాన్-క్లోజ్డ్) ప్రీ-పెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్ (వాలెట్)ని నిర్వహిస్తోందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) దృష్టికి వచ్చింది. ‘పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007లోని నిబంధనల ప్రకారం.. RBI నుంచి ధ్రువీకరణ పొందకుండానే sRide Tech Private Limitedతో వ్యవహరించే ఏ వ్యక్తి అయినా, వారి స్వంత పూచీతో చేస్తారని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది. ఈ యాప్ ఆర్బీఐ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పేర్కొంది. వినియోగదారులు ఎవరైనా ఈ యాప్ ఉయోగిస్తుంటే వెంటనే ఫోన్లో నుంచి డిలీట్ చేసేయాలని సూచించింది.

Rbi Cautions Public Against Ppis Issued By Unauthorised Entities

దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపులు, రుణాలు పెరగడంతో, అక్రమ రుణ యాప్‌లపై సెంట్రల్ బ్యాంక్ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. నవంబర్ 18 నాటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, మొబైల్ యాప్‌ల ద్వారా రుణాలు అందించే డిజిటల్ రుణాలపై వర్కింగ్ గ్రూప్ నివేదికను వెల్లడించింది. అందుబాటులో ఉన్న 1100 లెండింగ్ యాప్‌లలో 600 వరకు చట్టవిరుద్ధమని సెంట్రల్ బ్యాంక్ గుర్తించింది. లెండింగ్ యాప్‌ల సంఖ్య పెరిగేకొద్దీ ఈ ట్రెండ్ పెరుగుతుందని, ఎందుకంటే లెండింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసే వినియోగదారు యాప్ చట్టబద్ధమైనదా కాదా అని గుర్తించలేరని తెలిపింది.

ఇంటర్నెట్‌లో అనేక కాపీక్యాట్ యాప్‌లు, వెబ్‌సైట్‌లు పుట్టగొడుగుల్లా పుట్టే అవకాశం కూడా ఉందన్నారు. వినియోగదారులు ఈ యాప్ లేదా వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తుంటే, అది వినియోగదారు వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం (PII), ఆర్థిక డేటా, ఇతర సున్నితమైన వివరాలను సేకరించే అవకాశం ఉందని ఆర్బీఐ హెచ్చరించింది.

Read Also : Mukesh Ambani : వచ్చే 20 ఏళ్లలో గ్రీన్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్ హబ్‌గా భారత్ : ముఖేశ్ అంబానీ

ట్రెండింగ్ వార్తలు