×
Ad

Bank Lockers Rules: మీ బ్యాంక్ లాకర్‌ను సస్పెండ్ చేయొచ్చు, సీల్ కూడా చేయొచ్చు..! ఆర్బీఐ కొత్త రూల్..

ఒక నివేదిక ప్రకారం, బ్యాంకు నుండి లాకర్లను అద్దెకు తీసుకున్న ఖాతాదారుల్లో దాదాపు 20శాతం మంది RBI ఇచ్చిన డెడ్ లైన్ ముగిసిన తర్వాత కూడా..

Bank Lockers Rules: మీరు ఆభరణాలు లేదా విలువైన వస్తువులను ఉంచడానికి బ్యాంకులో లాకర్‌ను అద్దెకు తీసుకున్నారా? అయితే, ఈ వార్త మీకు ఉపయోగపడేదే. కొన్ని సంవత్సరాలుగా రిజర్వ్ బ్యాంక్ (RBI) బ్యాంక్ లాకర్లకు సంబంధించిన నిబంధనలలో కొన్ని మార్పులు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, కస్టమర్ కొత్త లాకర్ ఒప్పందంపై సంతకం చేయడం అవసరం. ఒప్పందంపై సంతకం చేయకపోతే మీకు, మీ లాకర్‌కు ఇద్దరికీ ప్రమాదం ఉండొచ్చు. అంతేకాదు బ్యాంక్ మీ లాకర్‌ను కూడా సీల్ చేయవచ్చు. ఈ పరిస్థితుల్లో బ్యాంక్ లాకర్ తీసుకునే కస్టమర్ సవరించిన అద్దె ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది.

కస్టమర్ చట్టపరమైన సాయం పొందొచ్చు..
ఒక నివేదిక ప్రకారం, బ్యాంకు నుండి లాకర్లను అద్దెకు తీసుకున్న ఖాతాదారుల్లో దాదాపు 20శాతం మంది RBI ఇచ్చిన డెడ్ లైన్ ముగిసిన తర్వాత కూడా కొత్త ఒప్పందంపై సంతకం చేయలేదు. ఈ పరిస్థితుల్లో వారి లాకర్‌ను సీల్ చేయొచ్చు. ఇంతకీ సవరించిన లాకర్ ఒప్పందంలో ఏముందంటే.. లాకర్‌లో ఉంచిన వస్తువులను బ్యాంకు కనుక సేఫ్ గా ఉంచలేకపోతే, కస్టమర్ చట్టపరమైన పరిష్కారాలను కోరవచ్చు. లాకర్‌కు సంబంధించిన నియమాలను పాటించని కస్టమర్‌పై బ్యాంకు చర్యలు తీసుకోవచ్చు. RBI ఈ మొత్తం విషయాన్ని పర్యవేక్షిస్తోంది.

అగ్రిమెంట్ రెన్యువల్ కోసం నోటీసులు పంపిన బ్యాంకులు..
కొన్ని రోజులుగా బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్‌ను కాంటాక్ట్ అయ్యాయి. కస్టమర్‌కు తుది నోటీసు పంపడానికి, లాకర్‌ను సీల్ చేయడానికి బ్యాంకులు అనుమతి పొందొచ్చు. నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం దీని ఉద్దేశ్యం. అగ్రిమెంట్ రెన్యువల్ కు సంబంధించి కస్టమర్లకు గుర్తు చేయడానికి బ్యాంకులు నోటీసులు పంపుతున్నాయి. లాకర్ ఒప్పందం కోసం RBI జారీ చేసిన మార్గదర్శకాలను మార్చి 2024 నాటికి పూర్తిగా అమలు చేయాల్సి ఉందని అందులో తెలిపాయి.

బ్యాంకు రిమైండ్ చేసినప్పటికీ.. చాలా మంది కస్టమర్లు సంప్రదించలేదు..
కస్టమర్ల ఫిర్యాదులు, అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని జనవరి 1, 2023 నాటికి ప్రస్తుత లాకర్ హోల్డర్లతో కొత్త ఒప్పందాలను అమలు చేయాలని RBI బ్యాంకులను 2021 ఆగస్టులో ఆదేశించింది. తర్వాత ఈ డెడ్ లైన్ ని డిసెంబర్ 2023 వరకు పొడిగించింది. ఆ తర్వాత మార్చి 31, 2024 వరకు పొడిగించింది. పదే పదే గుర్తు చేసినప్పటికీ కొంతమంది కస్టమర్లు పట్టించుకోవడం లేదని బ్యాంకు అధికారులు వాపోయారు.

Also Read: భారత తొలి 32-బిట్ “విక్రమ్‌” సెమీకండక్టర్ ప్రాసెసర్ చిప్ ఇది.. మోదీకి అందజేత.. ఇకపై మనదేశం ఈ రంగంలో.. ఏపీలోనూ