Realme Narzo 70 Turbo 5G
Realme Narzo 70 Turbo 5G : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? రియల్‌మి అభిమానులకు గుడ్ న్యూస్.. ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి కొత్త ఫోన్ రియల్‌మి నార్జో 70 టర్బో 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది.
ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసే కస్టమర్ల కోసం కంపెనీ అద్భుతమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ రియల్‌మి 5జీ ఫోన్ ప్రస్తుత ధర రూ. 13,998 ఉండగా ప్రస్తుతం రూ. 3వేలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ కోడ్ లిస్టింగ్ పేజీ ద్వారా యూజర్లకు అందుబాటులో ఉంది.
అదనంగా, అనేక బ్యాంకులు ఈ ఫోన్‌పై అనేక ఇతర ఆఫర్లను కూడా అందిస్తున్నాయి. మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్ లేదా HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే.. అదనంగా 7.5 శాతం తగ్గింపు (రూ. 1000 వరకు) పొందవచ్చు. ఈ డిస్కౌంట్, రూ. 3వేల వోచర్‌తో కలిపితే.. రియల్‌మి ఫోన్ ధర రూ. 12,998కి తగ్గుతుంది. అయితే, కస్టమర్‌లు ఫ్లిప్‌కార్ట్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5శాతం తగ్గింపును కూడా పొందవచ్చు.
రియల్‌మి నార్జో 70 టర్బో 5G ఫీచర్లు :
రియల్‌మి నార్జో 70 టర్బో 5G ఫోన్ 6.67-అంగుళాల డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 92.65 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగి ఉంది. నార్జో 70 టర్బో 5G స్మార్ట్‌ఫోన్ పవర్‌ఫుల్ డైమెన్సిటీ 7300 5G CPU, 12GB వరకు ర్యామ్ కలిగి ఉంది. 6GB RAM + 128GB స్టోరేజీ, 8GB RAM + 128GB స్టోరేజీ, 12GB RAM + 256GB స్టోరేజీ అనే 3 స్టోరేజీ ఆప్షన్లు కలిగి ఉంది.
కెమెరాలో 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ డెప్త్ కెమెరా, బ్యాక్ సైడ్ సెకండరీ కెమెరా ఉన్నాయి. ఇందులో 16ఎంపీ ఫ్రంట్-ఫేసింగ్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో USB టైప్ C పోర్ట్, GPS, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ 5.4 ఉన్నాయి.
45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఫోన్ 5000mAh బ్యాటరీ సపోర్టు ఇస్తుంది. డేటా పరంగా నార్జో 70 టర్బో 5G ఫోన్ 161.7mm పొడవు, 74.7mm వెడల్పు, 7.6mm మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అసలు ధర కన్నా సగానికే కొనేసుకోవచ్చు.