Realme P3 Series
Realme P3 Series : రియల్‌మి అభిమానులకు శుభవార్త.. రియల్‌మి కొత్తగా లాంచ్ చేసిన 5G స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపును ప్రకటించింది. లాంచ్ ధరల కన్నా రూ.7వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది.
రియల్‌మి P3 అల్ట్రా, రియల్‌మి P3, రియల్‌మి P3 ప్రోలతో రియల్‌మి P3 సిరీస్ కొద్ది రోజుల క్రితమే భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ రియల్‌మి మోడళ్లు ఇప్పుడు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో P-సిరీస్ కార్నివాల్ సేల్ సమయంలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్‌లు బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ EMI ఆప్షన్లతో సహా వివిధ డిస్కౌంట్లను పొందవచ్చు.
రియల్‌మి P3 సిరీస్‌పై ఆఫర్లు :
ఈ కార్నివాల్ సేల్‌లో భాగంగా రియల్‌మి P3 ప్రో, రియల్‌మి P3 కొనుగోలుదారులు రూ.4వేలు బ్యాంక్ డిస్కౌంట్, రూ.3,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్లలో మీరు రియల్‌మి P3 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను అసలు ధర రూ.23,999 నుంచి రూ.19,999కి తగ్గింది. రియల్‌మి P3 ప్రో ఫోన్ 3 స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో లభిస్తుంది. 8GB ర్యామ్ + 128GB, 8GB ర్యామ్ + 256GB, 12GB ర్యామ్ + 256GB, 256GB మోడల్ రూ. 20,999 నుంచి ప్రారంభమవుతుంది.
12GB ర్యామ్ వేరియంట్ ధర రూ. 22,999గా ఉంటే.. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ రియల్‌మి P3 బేస్ మోడల్ కొనుగోలుపై రూ.1,000 బ్యాంక్ ఆఫర్‌ను పొందవచ్చు. దాంతో ఈ ఫోన్ ధర రూ.15,999కి తగ్గుతుంది. ఈ మోడల్ ఇతర 2 వేరియంట్‌లకు రూ.2వేలు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఈ సిరీస్ అల్ట్రా వెర్షన్‌పై రూ.3వేలు బ్యాంక్ ఆఫర్‌ను పొందవచ్చు. రియల్‌మి P3 అసలు లాంచ్ ధర రూ.29,999 నుంచి రూ.26,999కి తగ్గింది.
రియల్‌మి P3 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
రియల్‌మి P3 అల్ట్రా ఫోన్ 6.83-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. 6,000mAh బ్యాటరీతో పవర్ అందిస్తుంది. 12GB వరకు ర్యామ్ సపోర్టు ఇస్తుంది. 256GB వరకు స్టోరేజీ ఆప్షన్లను అందిస్తుంది. మీరు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను పొందవచ్చు. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెకండరీ కెమెరా ఉన్నాయి. అదనంగా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది.