ఇండియన్ కరెన్సీలో తక్కువలో తక్కువగా 9వేల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. హైఎండ్ ధర
ఫోన్ల ప్రపంచంలో సంచలనం.. ఎంఐ వచ్చిన తర్వాత మొబైల్ మార్కెట్ స్వరూపమే మారిపోయింది. మొన్నటికి మొన్నే.. టీవీలు రిలీజ్ చేసి.. ఇండియన్ టెలివిజన్ మార్కెట్ ను షేక్ చేశారు. ఇప్పుడు అదేబాటలో వాషింగ్ మెషీన్స్ రిలీజ్ చేస్తోంది.
ఇప్పటికే చైనాలో మార్కెట్ లో దుమ్మురేపుతున్న ఈ సేల్స్.. అతి త్వరలోనే ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. షియోమీ (MI) వాషింగ్ మెషీన్స్ ధర కూడా చౌక అంటున్నారు. ఇండియన్ కరెన్సీలో తక్కువలో తక్కువగా 9వేల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. హై ఎండ్ ధర రూ. 22వేల వరకు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా.
Read Also : ఫేస్‌బుక్ బిగ్ బిజినెస్ ట్రిక్ : ఇన్‌స్టాగ్రామ్‌లో Shopping ఫీచర్ చూశారా?
8కేజీల కెపాసిటీ ఉన్న వాషింగ్ మెషీన్ ధర రూ.9వేలుగా ఉంది. 9 రకాల ఆప్షన్స్ ఇచ్చారు. డబుల్ బ్లాక్ డిజైన్, స్ట్రాంగ్ వాటర్ బ్రో, ఎలాంటి మరక అయినా తొలగిస్తోంది. దుస్తుల రకాలను బట్టి వాషింగ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు. తక్కువ నీళ్లతో ఎక్కువ ఉతుకు, ఆటోమేటిక్ డ్రై ఉందని ఘనంగా ప్రచారం చేస్తోంది కంపెనీ.
9వేల రూపాయల స్టార్టింగ్ ధరతోనే.. ఇన్ని ఆప్షన్స్ ఇచ్చిన ఎంఐ.. హైఎండ్ తో మాత్రం పెద్దపెద్ద కంపెనీలకు ధీటుగా ఇస్తుంది. ప్రస్తుతం మార్కెట్ లో లభించే వాషింగ్ మెషీన్స్ తో పోల్చితే ధర చాలా తక్కువగా ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు.
Read Also : రాధికా హైస్కూల్ లవ్ : కలలోకి వస్తాడని త్వరగా నిద్రపోయేదట