Redmi Note 14 : అమెజాన్‌లో Xiaomi సేల్.. ట్రిపుల్ కెమెరాలతో రూ. 18వేల రెడ్‌మి 5G ఫోన్ కేవలం రూ. 12వేలు మాత్రమే..!

Redmi Note 14 : షావోమీ సేల్ సందర్భంగా రెడ్‌మి 14 5G ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ట్రిపుల్ కెమెరాలతో ఈ రెడ్‌మి ఫోన్ కేవలం రూ. 12వేల ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Redmi Note 14 available

Redmi Note 14 Sale : కొత్త రెడ్‌మి ఫోన్ కావాలా? ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో షావోమీ సమ్మర్ సేవింగ్స్ సేల్‌ నడుస్తోంది. ఈ సేల్‌లో భాగంగా షియోమి స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డీల్స్ అందిస్తోంది. బడ్జెట్-ఫ్రెండ్లీ, ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లతో ఆఫర్ చేస్తోంది.

మీకు నచ్చిన రెడ్‌మి కొనేందుకు ఇదే సరైన సమయం. షావోమీ, రెడ్‌మి ఫోన్లు రెండింటిపై భారీ ధర తగ్గింపుతో అందిస్తోంది. కొత్త రెడ్‌మి నోట్ 14 5G ఇప్పుడు అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఫీచర్ల పరంగా పరిశీలిస్తే.. రెడ్‌మి నోట్ 14 5G మిడ్-రేంజ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

Read Also : CMF Phone 1 Price : ఆఫర్ అదిరింది భయ్యా.. అతి తక్కువ ధరకే నథింగ్ CMF ఫోన్ 1 కొనేసుకోండి.. డోంట్ మిస్!

మీరు గేమింగ్‌లో ఉన్నా లేదా రోజంతా మల్టీ టాస్కింగ్‌లో ఉన్నా ఈ 5జీ ఫోన్ అద్భుతంగా పనిచేస్తుంది. సాధారణంగా దాదాపు ఈ ఫోన్ రూ. 25వేల ధర ఉన్నప్పటికీ అమెజాన్ భారీ తగ్గింపు ధరకు అందిస్తోంది.

రెడ్‌మి నోట్ 14 5Gపై బిగ్ డిస్కౌంట్ :
ప్రస్తుతం అమెజాన్‌లో రెడ్‌మి నోట్ 14 (256GB స్టోరేజ్) ఫోన్ కేవలం రూ.17,998కే లిస్టు అయింది. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డ్‌లపై రూ.1,000 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. అమెజాన్ 128GB స్టోరేజ్‌తో రెడ్‌మి నోట్ 14 ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది.

AP Inter Results 2025

మీ పాత ఫోన్‌ను రూ.16,500 వరకు ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే, మీ ఫోన్ వర్కింగ్ కండిషన్, ఫిజికల్ కండిషన్‌‌పై ఆధారపడి ఉంటుంది. మీ పాత రెడ్‌మి ఫోన్ రూ.5వేలు ట్రేడింగ్ ఉన్నా ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.11,998 కన్నా తక్కువ ధరకు పొందవచ్చు.

రెడ్‌మి నోట్ 14 5G స్పెసిఫికేషన్లు :
రెడ్‌మి నోట్ 14 5G ఫోన్ స్టైలిష్ గ్లాస్ ఫినిష్ డిజైన్‌తో ప్లాస్టిక్ బ్యాక్ ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ IP64 రేటింగ్‌ను అందిస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కలిగిస్తుంది. అమోల్ఢ్ ప్యానెల్‌తో కూడిన 6.67-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. అద్భుతమైన వ్యూ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.

Read Also : iPhone 16 Plus Price : ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్లస్‌.. ఇలా చేస్తే ఇంకా తక్కువ ధరకే కొనేసుకోవచ్చు!

120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 2100 నిట్స్ ఫుల్ బ్రైట్‌నెస్‌‌తో కంటెంట్‌ను చూడొచ్చు. రెడ్‌మి నోట్ 14 5జీ ఫోన్ ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ కూడా ఉంది. 8GB ర్యామ్, 256GB స్టోరేజీ కాన్ఫిగరేషన్‌ మధ్య ఎంచుకోవచ్చు. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం 50+8+2MP మల్టీఫేస్ ట్రిపుల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ 20MP కెమెరాతో సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు.