చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మి నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చింది. ఇండియన్ మార్కెట్లలో Redmi Note 8 Proను అధికారికంగా కంపెనీ లాంచ్ చేసింది. ఈ కొత్త రెడ్ మి ఫోన్ 64మెగా ఫిక్సల్ ప్రైమరీ సెన్సార్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. అంతేకాదు.. గ్రేడియంట్ బ్యాక్ ప్యానెల్ 128GB వరకు ఆన్ బోర్డు స్టోరేజీ ఉంది. ఈ ఏడాదిలోనే రెడ్ మి నోట్ 7 ప్రో డ్యుయల్ రియర్ కెమెరాతో మార్కెట్లోకి వచ్చింది. దీనికి అడ్వాన్స్ గా రెడ్ మి నోట్ 8 ప్రో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఇందులో ఆక్టో-కోర్ మీడియా టెక్ హెలియో G90T సామర్థ్యంతో పనిచేస్తుంది. అమెజాన్ అలెక్సా, డిపాల్ట్ గూగుల్ అసిస్టెంట్, డ్యుయల్ వేక్ ఫంక్షనాల్టీతో పాటు హెలియో G90T SoC చిప్ సెట్ ఉంది.
డ్యుయల్ SIM (Nano) సపోర్ట్ తో వచ్చిన నోట్ 8 ప్రో MIUI 10 ఆధారిత ఆండ్రాయిడ్ ఓఎస్ తో రన్ అవుతుంది. 6GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర మార్కెట్లో రూ.14వేల 999గా నిర్ణయించగా.. మరో వేరియంట్ (6GB ర్యామ్ + 128GB స్టోరేజీ మోడల్ ధర రూ.17వేల 999గా నిర్ణయించింది. ఈ రెండు వేరియంట్లు గామా గ్రీన్, హాలో వైట్, షాడో బ్లాక్ కలర్ ఆప్షన్లతో లభ్యం కానుంది.
రెడ్ మి నోట్ 8 ప్రో మోడల్ సేల్ అక్టోబర్ 21 (సోమవారం) నుంచి అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్, ఎంఐ హోం స్టోర్లలో మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో ఉండనుంది. ఆఫ్ లైన్ స్టోర్లలో కూడా త్వరలో సేల్ ప్రారంభించనున్నట్టు కంపెనీ తెలిపింది. సేల్ ఆఫర్ల కింద రెడ్ మి నోట్ 8 ప్రో ఫోన్ కొనుగోలు చేసిన ఎయిర్ టెల్ కస్టమర్లకు 10 నెలల వరకు రూ.249, రూ.349 రీఛార్ల్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది.
స్పెషిఫికేషన్లు – ఫీచర్లు ఇవే :
* 6.53 అంగుళాల full HD+ (1080×2340 ఫిక్సల్స్) స్ర్కీన్
* వాటర్ డ్రాప్ స్టయిల్ డిస్ ప్లే నాచ్, కార్నింగ్ గొర్లిల్లా గ్లాస్ 5 (ఫ్రంట్ & బ్యాక్)
* అక్టో-కోర్ మీడియాటెక్ హెలియో G90T SoC
* క్వాడ్ రియర్ కెమెరా
* 64MP ప్రైమరీ సెన్సార్ f/1.89 లెన్స్
* సెకండరీ 8MP సెన్సార్ (అల్ట్రా వైడ్ యాంగిల్ f/2.2 లెన్స్)
* ఫిల్డ్ ఆఫ్ వ్యూ (FoV) 120 డిగ్రీలు
* 2 MP సెన్సార్లు, అల్ట్రా మైక్రో లెన్స్, డెప్త్ సెన్సింగ్ సపోర్ట్
* 20MP కెమెరా సెన్సార్ (సెల్ఫీలు) f/2.0 లెన్స్
* Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS/ A-GPS
* IR బ్లాస్టర్, USB Type-C, 3.5mm హెడ్ ఫోన్ జాక్
* 4,500mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
* 161.7×76.4×8.81mm, 200 గ్రాములు బరువు
* ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్