ఎట్రాక్టీవ్ Quad కెమెరాలు : Redmi 8 సిరీస్ ఫోన్లు ఇవే

షియోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి కొత్త నోట్ సిరీస్ ఫోన్లు అధికారికంగా లాంచ్ అయ్యాయి. రెడ్ మి నోట్ 8, రెడ్ మి నోట్ 8 ప్రొ.. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు చైనా మార్కెట్లో రిలీజ్ అయ్యాయి.

  • Publish Date - August 29, 2019 / 01:24 PM IST

షియోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి కొత్త నోట్ సిరీస్ ఫోన్లు అధికారికంగా లాంచ్ అయ్యాయి. రెడ్ మి నోట్ 8, రెడ్ మి నోట్ 8 ప్రొ.. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు చైనా మార్కెట్లో రిలీజ్ అయ్యాయి.

షియోమీ సబ్ బ్రాండ్ రెడ్‌మి నుంచి కొత్త నోట్ సిరీస్ ఫోన్లు అధికారికంగా లాంచ్ అయ్యాయి. రెడ్ మి నోట్ 8, రెడ్ మి నోట్ 8 ప్రొ.. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు చైనా మార్కెట్లో రిలీజ్ అయ్యాయి. బీజింగ్‌లో గురువారం (ఆగస్టు 29)న రెడ్ మి 8 సిరీస్ స్మార్ట్ ఫోన్లను షియోమీ రిలీజ్ చేసింది. రెడ్ మి నోట్ 8 ప్రోలో మీడియాటెక్ నుంచి హెలియో G90T చిప్ తో పాటు 64MP రియర్ మెయిన్ కెమెరా అందిస్తోంది. రెడ్ మి నోట్ 7 వెర్షన్ స్మార్ట్ ఫోన్‌కు రెడ్ మి నోట్ 8 అప్ గ్రేడెడ్ వెర్షన్. క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ కూడా ఉంది. రెడ్ మి 8 సిరీస్‌లో స్పోర్ట్స్ గ్రేడియంట్ డిజైన్, మైనర్ అప్‌గ్రేడ్ పవర్ ఫుల్ ప్రాసెసర్ అందిస్తోంది. 4 రియర్ కెమెరాలు, స్లిమర్ బెజిల్స్, ఆడియో ఇమ్రూవ్ మెంట్స్ ప్రత్యేక ఆకర్షణీయంగా ఉన్నాయి. 

రెడ్ మి 8 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 64మెగా ఫిక్సల్ రియర్ కెమెరా రావడం ఇదే తొలిసారి. ఇందులో క్వాడ్ కెమెరా సెటప్ స్పెషల్ ఎట్రాక్షన్ ఫీచర్లు ఉన్నాయి. ప్రైమరీ 48MP మెయిన్ కెమెరా, సెకండరీ సూపర్ వైడ్ యాంగిల్, మూడో కెమెరా డెప్త్ అఫ్ ఫీల్డ్ లెన్స్ కెమెరా, నాల్గోది సూపర్ మ్యాక్రో లెన్స్ ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. 4500mAh బ్యాటరీతో 18Wతో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. అంతేకాదు.. రెడ్ మి నోట్ 8 స్మార్ట్ ఫోన్ 10W ఛార్జర్ కూడా అందిస్తోంది. ఫ్రంట్ సైడ్ డాట్ డ్రాప్ నాచ్ తో పాటు సెల్ఫీ షూటర్ లోపల ఉంది. గొర్లిల్లా గ్లాస్ 5 సపోర్ట్ కూడా అందిస్తోంది. రెడ్ మి నోట్ 8 స్మార్ట్ ఫోన్ మోడల్స్ మొత్తం డ్రీమ్ బ్లూ, మెట్రోరైట్ బ్లాక్, వైట్ 3 కలర్లలో అందుబాటులో ఉంటాయి. రెడ్ మి నోట్ 8 ప్రో మోడల్ కూడా పెరల్ వైట్, ఐస్ ఎమిరాల్డ్, ఎలక్ట్రిక్ లైట్ గ్రే తో మొత్తం 3 కలర్లలో లభ్యం కానుంది. 

రెడ్ మి నోట్ 8, ప్రో ధరలు ఇవే : 
రెడ్ మి నోట్ 8 4GB +64GB వేరియంట్ ధర (చైనా మార్కెట్లో CNY 999 యాన్ ఉండగా.. ఇండియన్ కరెన్సీలో రూ.10వేల లోపు ఉంటుంది. స్మార్ట్ ఫోన్ 6GB +64GB, 6GB +128GB వేరియంట్లు CNY 1,199 (రూ.12వేలు), CNY1,399 (రూ,.14వేలు) వరకు ఉంటుంది. సెప్టెంబర్ 17న రెడ్ మి నోట్ 8 ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది. 

రెడ్ మి నోట్ 8 ప్రో రిటైల్ ప్రారంభం ధర CNY 1,399 (రూ.14వేలు) బేసిక్ వేరియంట్ (6GB ర్యామ్ + 64GB) ఆన్ బోర్డు స్టోరేజీ ఉంది. మరో వేరియంట్ 6GB +128GB, 8GB + 128GB మోడల్ ప్రారంభ ధర CNY 1,599 (రూ.16వేలు), CNY 1,799 (రూ.18వేలు) అందుబాటులో ఉంటుంది. సెప్టెంబర్ 3 నుంచి రెడ్ మి నోట్ 8 ప్రో ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది. 

ఫీచర్లు – స్పెషిఫికేషన్లు ఇవే :
* డ్యుయల్ SIM (నానో) MIUI 10
* ఆండ్రాయిడ్ 9 పై 
* 6.39 అంగుళాల Full HD + (1080×2340) స్ర్కీన్
* గొర్లిల్లా గ్లాస్ 5, ఫ్రంట్ అండ్ బ్యాక్, వాటర్ డ్రాప్ స్టయిల్ నాచ్ (ఫ్రంట్)
* క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 665 SoC
* 6GB ర్యామ్ 
* 48MP ప్రైమరీ సెన్సార్ (నోట్ 8) 
* వైడ్ యాంగిల్ 8MP సెన్సార్ 
* 2MP కెమెరాలు, 13MP సెల్ఫీ కెమెరా
* 4000mAh బ్యాటరీ 
* 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 
* USB టైప్-సి పోర్ట్, 3.5mm ఆడియో జాక్, IR బ్లాస్టర్

Red mi నోట్ 8 ప్రో : 
* 6.53 అంగుళాల Full HD + (1080×2340 ఫిక్సల్స్) స్ర్కీన్
*  (19:5:9 యాస్పెక్ట్ రేషియో) 
* వాటర్ డ్రాప్ నాచ్, గొర్రిల్లా గ్లాస్ (ఫ్రంట్ అండ్ బ్యాక్)
* MediaTek కొత్త గేమింగ్, helio G90T SoC
* 8GB ర్యామ్ పేయిర్
* లిక్విడ్ కూలింగ్ సపోర్ట్
* గేమ్ టర్భో 2.0 మోడల్
* 64MP మెయిన్ కెమెరా
* 8MP వైడ్ యాంగిల్ షూటర్
* డ్యుయల్ 2MP కెమెరాలు
* 20MP సెల్ఫీ కెమెరా (ఫ్రంట్) 
* 4500mAh బ్యాటరీ
* 18W ఫాస్ట్ ఛార్జింగ్
* NFC, USB Type-C పోర్ట్
* 3.5mm ఆడియో జాక్
* IR బ్లాస్టర్ 
* IP52 సర్టిఫైయిడ్ ఫోన్