రూ.10వేల లోపు : Redmi Note 8 సిరీస్ వచ్చేస్తోంది
షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మి నుంచి కొత్త నోట్ సిరీస్ ఫోన్లు రాబోతున్నాయి.

షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మి నుంచి కొత్త నోట్ సిరీస్ ఫోన్లు రాబోతున్నాయి.
షియోమీ సబ్ బ్రాండ్ రెడ్ మి నుంచి కొత్త నోట్ సిరీస్ ఫోన్లు రాబోతున్నాయి. రెడ్ మి నోట్ 8, రెడ్ మి నోట్ 8 ప్రొ.. ఈ రెండు స్మార్ట్ ఫోన్లు ఆగస్టు 29న చైనా మార్కెట్లో రిలీజ్ కానున్నాయి. లాంచింగ్ ముందుగానే కంపెనీ ఈ రెండు సిరీస్ ఫోన్లకు సంబంధించి వివరాలను వెల్లడించింది. రెడ్ మి నోట్ 8 ప్రోలో మీడియాటెక్ నుంచి హెలియో G90T చిప్ తో పాటు 64MP రియర్ మెయిన్ కెమెరా అందిస్తోంది. రెడ్ మి నోట్ 7 వెర్షన్ స్మార్ట్ ఫోన్‌కు రెడ్ మి నోట్ 8 అప్ గ్రేడెడ్ వెర్షన్. క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ కూడా ఉంది. ఇటీవల షియోమీ లాంచ్ చేసిన Mi A3 ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్ ఫోన్ లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంది. రెడ్ మినోట్ 7లో మాత్రం స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉంది.
రెడ్ మి నోట్ 8లో రియల్ ప్యానెల్ ట్రిపుల్ కెమెరాలు ఉన్నట్టు రెడ్ మి స్పష్టం చేసింది. మిగిలిన ఫీచర్లను లాంచింగ్ సమయంలో కంపెనీ పూర్తిగా రివీల్ చేయనుంది. ప్రైమరీ 48MP మెయిన్ కెమెరా, సెకండరీ సూపర్ వైడ్ యాంగిల్, మూడో కెమెరా డెప్త్ అఫ్ ఫీల్డ్ లెన్స్ కెమెరా, నాల్గోది సూపర్ మ్యాక్రో లెన్స్ ఉంటుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. 4500mAh బ్యాటరీతో 18Wతో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది.
అంతేకాదు.. రెడ్ మి నోట్ 8 స్మార్ట్ ఫోన్ 10W ఛార్జర్ కూడా అందిస్తోంది. ఫ్రంట్ సైడ్ డాట్ డ్రాప్ నాచ్ తో పాటు సెల్ఫీ షూటర్ లోపల ఉంది. గొర్లిల్లా గ్లాస్ 5 సపోర్ట్ కూడా అందిస్తోంది. రెడ్ మి నోట్ 8 స్మార్ట్ ఫోన్ చైనా మార్కెట్లో 1000 యాన్ లేదా (రూ.10వేల లోపు) ఉంటుంది. ఇండియాలో రెడ్ మి నోట్ 7 ఫోన్ ధర రూ.9వేల 999కే అందుబాటులో ఉంది.
ఫీచర్లు – స్పెషిఫికేషన్లు ఇవే :
* మీడియో టెక్ హెలియో G90T చిప్
* 64MP రియర్ మెయిన్ కెమెరా
* క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్
* ట్రిపుల్ కెమెరాలు (రియర్ ప్యానెల్)
* 48MP ప్రైమరీ మెయిన్ కెమెరా
* సెకండరీ సూపర్ వైడ్ యాంగిల్
* డాట్ డ్రాప్ నాచ్ (ఫ్రంట్)
* సెల్ఫీ సూటర్, గొర్రిల్లా గ్లాస్ 5 సపోర్ట్
* థర్డ్ డెప్త్ ఆఫ్ ఫిల్డ్ లెన్స్ కెమెరా
* సూపర్ మ్యాక్రో లెన్స్
* 4500mAh బ్యాటరీ
* 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
* 10W ఛార్జర్ (ఇన్ సైడ్ బాక్స్)