Reels Earn Money
Reels Earn Money : రీల్స్ క్రియేట్ చేసే వారి కోసం ప్రభుత్వం ఒక కొత్త ప్రొగ్రామ్ ప్రారంభించింది. మీరు రీల్స్ క్రియేట్ చేయడం, వ్లాగింగ్ చేయడం ఇష్టపడే (Reels Earn Money) వారిలో ఒకరైతే ఇది మీకోసమే.. రీల్స్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు. డిజిటల్ ఇండియా చొరవలో 10 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ‘ఎ డికేడ్ ఆఫ్ డిజిటల్ ఇండియా – రీల్ కాంటెస్ట్’ అనే కొత్త పోటీని ప్రారంభించింద. ఇందులో కంటెంట్ క్రియేటర్లు రూ. 15వేల క్యాష్ ప్రైజ్ గెలుచుకోవచ్చు.
డిజిటల్ ఇండియా మిషన్‌కు10 ఏళ్లు :
నరేంద్ర మోదీ ప్రభుత్వం డిజిటల్ ఇండియా మిషన్ 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కాంపిటేషన్ ప్రవేశపెట్టారు. డిజిటల్ ఇండియా జీవితంలో తీసుకువచ్చిన సానుకూల మార్పులను ప్రదర్శించే కంటెంట్‌ను పాల్గొనేవారు క్రియేట్ చేయాలి.
డిజిటల్ ఇండియా మిషన్ ఆన్‌లైన్ సర్వీసులు, ఇ-లెర్నింగ్, ఆరోగ్యం, ఆర్థిక సేవలను మెరుగుపరిచిందని భావిస్తే.. మీరు ఈ థీమ్‌లకు సంబంధించిన రీల్‌లను క్రియేట్ చేసి ప్రభుత్వానికి సమర్పించవచ్చు. మీ రీల్స్ ఎంత క్రియేటీవ్‌గా ఉంటే మీరు గెలిచే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.
ఈ పథకానికి ఎలా అప్లయ్ చేయాలంటే? :