Buy Safest Cars : మీరు ఫస్ట్ టైం కారు కొంటున్నారా? రూ. 10లక్షల లోపు 5 స్టార్ రేటింగ్ 6 సేఫ్టీ కార్లు.. ఫ్యామిలీ సేఫ్టీనే ముఖ్యం..!
Buy Safest Cars : కొత్త సేఫ్టీ కారు కోసం చూస్తున్నారా? 5 స్టార్ రేటింగ్‌తో 6 అద్భుతమైన కార్లు ఉన్నాయి.. ఏ కారు కొంటారో మీదే ఛాయిస్..

Buy Safest Cars
Buy Safest Cars : కొత్త కారు కొంటున్నారా? భారత మార్కెట్లో అనేక బ్రాండ్ల కార్లు అందుబాటులో ఉన్నాయి. 2025 నాటికి దేశ మార్కెట్లో రూ. 10 లక్షల లోపు 6 సేఫ్టీ (Buy Safest Cars) కార్లు లభ్యమవుతున్నాయి. అన్నీ భారత్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌లతో ఉన్నాయి.
ఈ కార్లలో ప్రయాణికుల సేఫ్టీ కోసం ఎయిర్‌బ్యాగ్‌లు, స్టెబిలిటీ కంట్రోల్, చైల్డ్ సీట్ మౌంట్‌లు వంటి కీలక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. మీరు ఫస్ట్ టైమ్ కారు కొనేందుకు చూస్తుంటే ఇలాంటి సేఫ్టీ కార్లనే ఎంచుకోండి. మీతో పాటు మీ కుటుంబ సభ్యుల సేఫ్టీ కోసం అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఏయే బ్రాండ్ల కారు మోడల్స్ అందుబాటులో ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం..
టాటా పంచ్ ఈవీ :
భారత మార్కెట్లో టాటా పంచ్.ఈవీ కారు ధర రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్ ధర) నుంచి ప్రారంభమవుతుంది. పెద్దలు, పిల్లల ప్రయాణీకుల సేఫ్టీ కోసం 5-స్టార్ భారత్ NCAP రేటింగ్‌ను పొందింది. ఈ EV ఫ్రంట్ సీట్లకు ఎయిర్‌బ్యాగులు, అన్నివైపులా కర్టెన్ ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి సీట్‌బెల్ట్ రిమైండర్‌లతో సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. పిల్లల సీట్లకు ISOFIX మౌంట్ కూడా కలిగి ఉంది. ప్రమాదం జరిగినప్పుడు పాదచారులను ప్రొటెక్ట్ చేస్తుంది.
మహీంద్రా-XUV 3XO :
మహీంద్రా XUV 3XO కారు ధర రూ. 8.94 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. పెద్దలు, పిల్లల రక్షణ కోసం భారత్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. ఫ్రంట్, సైడ్ ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) వంటి ప్రయాణీకులకు సీట్‌బెల్ట్ రిమైండర్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లను అందిస్తుంది. ఈ కారులో పిల్లల సీట్ల కోసం ISOFIX మౌంట్‌లు కూడా ఉన్నాయి. పాదచారులకు ఇంటర్నల్ సేఫ్టీ ఫీచర్ కూడా ఉంది.
టాటా కర్వ్ :
కారులో ప్రయాణించే పెద్దలు, పిల్లల సేఫ్టీ కోసం టాటా కర్వ్ భారత్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. భారత మార్కెట్లో అత్యంత సురక్షితమైన మిడ్-సైజ్ SUVలో ఒకటి. ఈ కారు ధర రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
ఈ కారు ఫ్రంట్ సీట్లకు ఎయిర్‌బ్యాగ్‌లు, అన్ని వరుసలకు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. ఫ్రంట్ సీట్లకు అదనపు సేఫ్టీ ఫీచర్లతో స్ట్రాంగ్ సీట్ బెల్టులను కలిగి ఉంది. పిల్లల సీట్ల సేఫ్టీ కోసం బ్యాక్ సైడ్ ISOFIX మౌంట్‌లు ఉన్నాయి. కారులోని ప్రయాణీకులందరిని తప్పనిసరిగా సీట్ బెల్టులు ధరించమని అలర్ట్ చేస్తుంది. ESC, పాదచారుల రక్షణ వంటి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
మారుతి సుజుకి డిజైర్ :
మారుతి సుజుకి డిజైర్ ధర రూ. 6.83 లక్షలు (ఎక్స్-షోరూమ్). పెద్దలు, పిల్లలు ఇద్దరికీ భారత్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ కారు అన్ని మోడళ్లలో స్టాండర్డ్ ఫీచర్లు కలిగిన 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. ఈ ఎయిర్‌బ్యాగ్‌లలో డ్రైవర్, ప్రయాణీకుల కోసం ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ప్రమాదం జరిగితే కారు లోపల ఉన్న ప్రతి ఒక్కరినీ సురక్షితంగా ఉంచుతాయి.
కియా సైరోస్ :
కియా సైరోస్ పెద్దలు, పిల్లలు ఇద్దరికీ భారత్ NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 9.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి అందుబాటులో ఉంది. ఫార్వర్డ్ కొలిషన్ అవాయిడెన్స్ అసిస్ట్ వంటి స్మార్ట్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ముందుగానే అడ్డంకులను గుర్తించి ప్రమాదాలను ఆపేలా ఆటోమాటిక్ బ్రేక్‌లతో కంట్రోల్ చేయగలదు.
స్టాప్, గోతో స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ కూడా కలిగి ఉంది. ఇతర కార్ల నుంచి సేఫ్టీ డిస్టెన్స్ ఉంచుతుంది. ట్రాఫిక్‌లో స్పీడ్ కంట్రోల్ చేస్తుంది. లేన్ కీప్ అసిస్ట్, డిపార్చర్ వార్నింగ్ లేన్‌లో ఉండడం, సురక్షితంగా డ్రైవ్ చేసేందుకు సాయపడతాయి. రోడ్డుపై ప్రమాదాల నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసేందుకు కారు 6 ఎయిర్‌బ్యాగ్‌లు, బ్లైండ్ స్పాట్ కొలిషన్ అలర్ట్‌తో వస్తుంది.
స్కోడా కైలాక్ కారు :
భారత మార్కెట్లో స్కోడా కైలాక్ కారు పెద్దలు, పిల్లల సేఫ్టీ కోసం NCAP నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను కలిగి ఉంది. ఈ కారు ధర రూ. 7.89 లక్షల నుంచి అమ్మకానికి ఉంది. ఈ కారు ఫ్రంట్ సీట్లకు ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రమాద సమయంలో స్పెషల్ సీట్ బెల్టులు, తల, శరీరాన్ని ప్రొటెక్ట్ చేసేందుకు అన్ని వైపులా ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. దీనికి బ్యాక్ సైడ్ చైల్డ్ సీట్ హోల్డర్‌లు కూడా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, పాదచారుల రక్షణ, సీట్ బెల్ట్ రిమైండర్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.