PM Kisan Yojana : రైతులకు బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ 20వ విడత వచ్చే తేదీ ఇదే? మీ అకౌంట్‌‌లో రూ. 2వేలు ఎప్పుడైనా పడొచ్చు..!

PM Kisan Yojana : పీఎం కిసాన్ రైతుల కోసం 20వ విడత రాబోతుంది. మీ అకౌంటులో రూ. 2వేలు పడగానే బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలంటే?

PM Kisan Yojana : రైతులకు బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ 20వ విడత వచ్చే తేదీ ఇదే? మీ అకౌంట్‌‌లో రూ. 2వేలు ఎప్పుడైనా పడొచ్చు..!

PM Kisan Yojana

Updated On : July 22, 2025 / 1:08 PM IST

PM Kisan Yojana 20th installment : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. అతి త్వరలో పీఎం కిసాన్ రూ. 2వేలు పడొచ్చు. ప్రస్తుతం, నరేంద్ర మోదీ ప్రభుత్వం 20వ విడత (PM Kisan Yojana) తేదీకి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, 20వ విడత వచ్చే వారంలో ఏ క్షణమైనా రిలీజ్ కావచ్చునని భావిస్తున్నారు. రైతులు అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేసి తమ లబ్ధిదారుల స్టేటస్ చెక్ చేయవచ్చు.

దేశంలోని రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-KISAN) పథకాన్ని నిర్వహిస్తోంది. ఈ పథకం కింద ప్రతి ఏడాదిలో రైతులకు రూ. 6 వేల ఆర్థిక సాయం అందిస్తోంది. రైతుల బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ. 2 వేల చొప్పున 3 విడతలుగా పంపిణీ చేస్తోంది.

పీఎం కిసాన్ 20వ వాయిదా ఎప్పుడు వస్తుంది? :
కేంద్ర ప్రభుత్వం గత జూన్ నెలలో 20వ విడత (PM Kisan Yojana) విడుదల చేయవచ్చునని ఊహాగానాలు వచ్చాయి. అప్పుడు జూలై 18న బీహార్‌లో నిర్వహించిన కార్యక్రమం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ 20వ విడత విడుదల చేస్తారని భావించారు. కానీ, అలా జరగలేదు. ఇప్పుడు వచ్చే వారంలో లేదా ఆగస్టు 2న 20వ విడత విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Read Also : Apple MacBook Air M4 : కొత్త ల్యాప్‌టాప్ కొంటున్నారా? ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M4 ధర తగ్గిందోచ్.. ఈ డీల్ అసలు వదులుకోవద్దు..!

పీఎం కిసాన్ 20వ విడత ఎప్పుడు వస్తుందోనని రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ 20వ విడత తేదీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రభుత్వం ఏదైనా కొత్త అప్‌డేట్ విడుదల చేసిన వెంటనే అధికారిక వెబ్‌సైట్, వార్తా ఛానెల్‌ల ద్వారా రైతులకు అందుబాటులో ఉంటుంది.

పీఎం కిసాన్ 19 విడతలు విడుదల :
ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 19 విడతలను విడుదల చేసింది. చివరి విడతగా 19వ విడత ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రైతులకు అందింది. ఈ విడత విడుదలై 4 నెలలకు పైగా అవుతుంది.

రైతులు పీఎం కిసాన్ బ్యాలెన్స్‌ ఎలా (PM Kisan Yojana) చెక్ చేయాలి? :

  • ముందుగా PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌(https://pmkisan.gov.in/)ను విజిట్ చేయండి.
  • పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో ‘Beneficiary Status’ పేజీని ఓపెన్ చేయండి.
  • అక్కడ ‘Beneficiary Status’పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ ఆధార్ నంబర్ లేదా అకౌంట్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • ఆ తర్వాత ‘Get Deata’ బటన్‌పై క్లిక్ చేయండి.
  • మీ లబ్ధిదారుని స్టేటస్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • మీ వాయిదా పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేయవచ్చు.