యూజర్లకు ట్విస్ట్: జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్

జియోకు పోటీగా ఇటీవలే ఇతర టెలికం దిగ్గజాలైన ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం లాంగ్ వ్యాలీడెటీ ప్లాన్స్ ను ప్రకటించాయి. జియో కూడా తమ వినియోగదారుల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.

  • Publish Date - January 24, 2019 / 11:15 AM IST

జియోకు పోటీగా ఇటీవలే ఇతర టెలికం దిగ్గజాలైన ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం లాంగ్ వ్యాలీడెటీ ప్లాన్స్ ను ప్రకటించాయి. జియో కూడా తమ వినియోగదారుల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది.

టెలికం రంగంలో లాంగ్ టెర్న్ వ్యాలీడెటీ ప్లాన్ ట్రెండ్ నడుస్తోంది. టెలికం రంగ దిగ్గజ మొబైల్ నెట్ వర్క్ సంస్థలు పోటీపడి ఆఫర్లు గుప్పిస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. కొద్దికాలంలోనే టెలికం రంగాన్ని శాసించి నెంబర్ వన్ స్థానంలో నిలిచిన రిలయన్స్ జియో కూడా రెండు సరికొత్త ప్లాన్లతో ముందుకొచ్చింది. జియోకు పోటీగా ఇటీవలే ఇతర టెలికం దిగ్గజాలైన ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం లాంగ్ వ్యాలీడెటీ ప్యాక్ లను ప్రకటించాయి. జియో కూడా తమ వినియోగదారుల కోసం రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. అవే.. రూ. 594, రూ. 297 లాంగ్ వ్యాలీడెటీ ప్లాన్స్.

కానీ, తమ యూజర్లకు గుడ్ న్యూస్ తో పాటు రిలయన్స్ జియో కొత్త ట్విస్ట్ కూడా ఇచ్చింది. ఈ రెండు  లాంగ్ వ్యాలీడెటీ ప్యాక్స్ అన్నీ జియో ఫోన్ యూజర్లకు వర్తించదని చివరిలో ట్విస్ట్ ఇచ్చింది. ఈ రెండు ప్లాన్లు జియో ఫోన్, జియో ఫోన్ 2 యూజర్లకు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ కొత్త లాంగ్ వ్యాలీడెటీ ప్లాన్లు జియోఫోన్ యూజర్లుకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. చాలాకాలం తరువాత ఈ కంపెనీ జియో ఫోన్ యూజర్లకు అందించే రీఛార్జ్ ప్లాన్ జాబితాను అప్ డేట్ చేసింది

ఇప్పటివరకూ జియో ఫోన్ యూజర్లకు ఈ ప్లాన్లు కేవలం 28 రోజుల కాల పరిమితిపై మాత్రమే లభిస్తున్నాయి. ఇప్పటి నుంచి ఈ ప్లాన్ల కాల పరిమితిని లాంగ్ వ్యాలీడెటీపై జియో యూజర్లు పొందొచ్చు. ఈ ప్లాన్ ఒకసారి మాత్రమే యాక్టివేట్ చేసుకోనే వీలుంది.  ప్రస్తుతం జియో ఫోన్ యూజర్లకు రూ. 49, రూ. 99, రూ.153 ప్లాన్లు అన్నీ 28 రోజుల వ్యాలీడెటీపై మాత్రమే రీఛార్జ్ ఆప్షన్ ఉంది. జియో ప్రకటించిన కొత్త ప్రీపెయిడ్ ప్లానతో యూజర్లకు అదనపు సమయం లభించింది. జియో అందించే రూ. 297 ప్లాన్ పై 84 రోజుల వ్యాలీడెటీ అందిస్తోంది. అంటే.. దాదాపు 3 నెలలు అనమాట. కస్టమర్లకు అన్ లిమిటెడ్ డేటా కూడా ఉచితం. 28 రోజుల పాటు 300 ఎస్ఎంఎస్ లు ఫ్రీ. అలాగే ప్రతిరోజు 0.5 జీబీ హైస్పీడ్ డేటా.. పరిమితి దాటాక 64Kbps ఇంటర్నెట్ అన్ లిమిటెడ్ మాత్రమే వస్తుంది. ఈ ప్లాన్ లో మొత్తం మీద హైస్పీడ్ డేటా 42జీబీ, 900 ఫ్రీ ఎస్ఎంఎస్ లు పొందొచ్చు. జియో యాప్స్ నుంచి రూ.297 ప్లాన్ యాక్టివేట్ చేసుకోవచ్చు.    

ఇక జియో రూ. 594 ప్లాన్ విషయానికి వస్తే.. దీని కాల పరిమితి 168 రోజులు. రీఛార్జ్ చేయించిన రోజు నుంచి దాదాపు 6 నెలలు అనమాట. ఈ ప్లాన్ లో ఫ్రీ వాయిస్ కాలింగ్ కూడా ఉంది. 28 రోజుల వ్యాలీడెటీపై 300 ఎస్ఎంఎస్, జియో యాప్స్ కు ఫ్రీ యాక్సెస్ సౌకర్యం ఉంది. ప్రతిరోజూ అన్ లిమిటెడ్ డేటా 0.5జీబీ హైస్పీడ్ డేటా పొందొచ్చు. రోజులో 64కేబీపీఎస్ పరిమితి FUP limit దాటగానే డేటా స్పీడ్ తగ్గిపోతుంది. ఈ ప్యాక్ లో మొత్తం 84 జీబీ హైస్పీడ్ డేటా, 1800 ఉచిత ఎస్ఎంఎస్ లు పొందవచ్చు.   

ట్రెండింగ్ వార్తలు