Jio Fiber vs Airtel Fiber : టాప్ broadband ప్లాన్లు ఇవే

రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికం రంగంలో మొబైల్ డేటా విప్లవానికి తెర లేసింది. తక్కువ ధరకే ఎక్కువ డేటా ఇవ్వడంతో ఇతర నెట్ వర్క్ యూజర్లంతా జియో బాటపట్టారు. తమ కస్టమర్లను ఆకర్షించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర నెట్ వర్క్ లు కూడా జియో బాటలోనే డేటా ధరలతో ముందుకొచ్చాయి. జియో పోటీని తట్టుకునేందుకు వరుసగా డేటా ఆఫర్లను గుప్పించాయి. ఇప్పుడు ఫైబర్ నెట్ వర్క్ లోనూ ఇదే పోటీ వాతావరణం నెలకొంది.
జియోఫైబర్ అందించే డేటా ప్లాన్లకు పోటీగా ఇతర టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ కూడా వివిధ ఫైబర్ ప్లాన్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఎయిర్ టెల్, జియో ఫైబర్ తమ యూజర్ల కోసం పలు ఫైబర్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు 1Gbps వరకు హైస్పీడ్ ఇంటర్నెట్ తోపాటు OTT ప్లాట్ ఫాంపై వీడియో కంటెంట్ స్ట్రీమింగ్ యాక్సస్ ఆఫర్ చేస్తున్నాయి. రిలయన్స్ జియో ఫైబర్, ఎయిర్ టెల్ ఫైబర్ అందించే బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లలో టాప్ ప్లాన్లు ఏంటో ఓసారి చూద్దాం..
Airtel Fiber :
ఎయిర్ టెల్ ఫైబర్.. నెలవారీ ప్లాన్లలో 4 కేటగిరీలుగా ఆఫర్ చేస్తోంది. అందులో బేసిక్, ఎంటర్ టైన్ మెంట్, ప్రీమియం, VIP కేటగిరీలతో యూజర్లకు అందిస్తోంది. Basic ప్లాన్ నెలకు రూ.799లు చెల్లించాల్సి ఉంటుంది. ఎయిర్ టెల్ అందించే ఖరీదైన ప్లాన్లలో ఇదొకటి. ఈ ప్లాన్ లో యూజర్ 100Mbps స్పీడ్ వరకు 150GB ఇంటర్నెట్ డేటాను వాడుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా.. Airtel XStream సబ్ స్ర్కిప్షన్ తో పాటు Airtel Thanks బెనిఫిట్ కూడా కస్టమర్లు పొందవచ్చు.
* ఎయిర్ టెల్ ఫైబర్ ఆఫర్ చేసే ఖరీదైన టాప్ ప్లాన్లలో రూ.3,999ల ప్లాన్ మరొకటి. VIP ప్లాన్‌లో భాగంగా 1Gbps స్పీడ్ వరకు యూజర్లు Unlimited Data పొందవచ్చు.. ఈ ప్లాన్ కింద యూజర్.. OTT స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం Netflix నుంచి 3 నెలల సబ్ స్ర్కిప్షన్ కూడా పొందవచ్చు. అంతేకాదు… మరో స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం Amazon Prime నుంచి 12నెలల (ఏడాది) సబ్ స్ర్కిప్షన్, Zee5, Airtel XStream సబ్ స్ర్కిప్షన్లను కూడా పొందవచ్చు.
* ఎయిర్ టెల్ అందించే యూజర్ ఫ్రెండ్లీ ప్లాన్లలో ఇదొకటి.. నెలకు రూ.999 చెల్లిస్తే చాలు… ఎంటర్ టైన్ మెంట్ యాక్సస్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు 200Mbps స్పీడ్ వరకు 300GB డేటాను వాడుకోవచ్చు. Netflix నుంచి 3 నెలల సబ్ స్ర్కిప్షన్, అమెజాన్ ప్రైమ్, Zee5, Airtel XStream నుంచి 12 నెలల సబ్ స్ర్కిప్షన్ పొందవచ్చు.
Reliance Jio Fiber :
రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం సరికొత్త ఫైబర్ ప్లాన్లు ఆఫర్ చేస్తోంది. బ్రౌంజ్, సిల్వర్, గోల్డ్, డైమండ్, ప్లాటీనం, టైటానియం వంటి 6 కేటగిరీలతో అందిస్తోంది. ఈ ప్లాన్లు అన్నింటిపై Unlimited Voice Calling భారతదేశ వ్యాప్తంగా ఆఫర్ చేస్తోంది.
సాధారణంగా ఫ్రీ రోమ్ వర్చువల్ రియాల్టీ ఎంటర్ టైన్ మెంట్ ఎక్స్ పీరియన్స్ పొందేలా యూజర్ల కోసం TV వీడియో కాలింగ్, కాన్ఫిరెన్సింగ్, జీరో లాటెన్సీ గేమింగ్ సర్వీసును ఏడాదికి రూ.1,200తో జియో ఫైబర్ ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్లలో హోం నెట్ వర్కింగ్ ద్వారా ఇంట్లోనూ బయట ఈజీగా కంటెంట్ షేర్ చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఏడాదికి రూ.999తో రీఛార్జ్ చేస్తే 5 డివైజ్‌ల వరకు నార్తన్ డివైజ్ సెక్యూరిటీ పొందవచ్చు.
Bronze Plan :
* Bronze పైబర్ డేటా ప్లాన్.. జియో ఫైబర్ అందించే ప్లాన్లలో చీపెస్ట్ ప్లాన్. నెలకు రూ.699 రీఛార్జ్ తో అందుబాటులో ఉంది. 150GB డేటా వరకు పొందవచ్చు. 100Mbps వరకు స్పీడ్ పొందవచ్చు. అంతేకాదు.. మూడు నెలల పాటు OTT యాప్స్ Jio Cinema, Jio Saavan యాక్సస్ పొందవచ్చు.
Titanium Plan :
* అత్యంత ఖరీదైన జియో ఫైబర్ ప్లాన్లలో ఇదొకటి. అదే.. టైటానియం ప్లాన్. నెలకు 8,499 చెల్లించాలి. దీంతో యూజర్లు.. 5000GB వరకు ఇంటర్నెట్ భారీ డేటాను 1Gbps స్పీడ్‌తో పొందవచ్చు. థియేటర్ మాదిరిగా వినిపించేలా VR హెడ్ సెట్, ప్రీమియం కంటెంట్ కూడా పొందవచ్చు.
ప్రత్యేకించి ఈ ప్లాన్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీలు, స్పెషల్ స్పోర్ట్స్ కంటెంట్ కూడా ఉన్నాయి. అలాగే, OTT అప్లికేషన్స్ Hotstar, SonyLiv, Voot, JioCinema ప్లాట్ ఫాంల నుంచి స్ట్రీమింగ్ కంటెంట్‌ను Unlimited యాక్సస్ చేసుకోవచ్చు.
Gold Plan :
* జియో అందించే యూజర్ ఫ్రెండ్లీ ఆఫర్లలో గోల్డ్ ప్లాన్ ఒకటి. నెలకు రూ.1,299 చెల్లించాల్సి ఉంటుంది. 750GB డేటాను 250 Mbps స్పీడ్ తో పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా యూజర్లు OTT అప్లికేషన్లలో HoStar, SonyLiv, Voot, JioCinema స్ట్రీమింగ్ కంటెంట్ Unlimited యాక్సస్ చేసుకోవచ్చు.