జియో Fiber ఎఫెక్ట్ : Hathway డేటా ఆఫర్.. నెలకు రూ.399 మాత్రమే
జియో ఫైబర్ దెబ్బకు ఇతర పోటీదారులైన బ్రాడ్ బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లు తమ యూజర్లను ఆకర్షించేందుకు చౌకైన ధరకే డేటా ప్లాన్ ఆఫర్లు గుప్పిస్తున్నాయి.

జియో ఫైబర్ దెబ్బకు ఇతర పోటీదారులైన బ్రాడ్ బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లు తమ యూజర్లను ఆకర్షించేందుకు చౌకైన ధరకే డేటా ప్లాన్ ఆఫర్లు గుప్పిస్తున్నాయి.
రిలయన్స్ జియో ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసు ప్రకటనతో ఇండియా టెలికం సెక్టార్‌లో ప్రకంపనలు సృష్టించాయి. జియో ఫైబర్ (FTTH) సర్వీసు కమర్షియల్ లాంచ్ కాకముందే భారీ ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. రిలయన్స్ జియో ఫైబర్ సర్వీసు సెప్టెంబర్ 5న కమర్షియల్ లాంచ్ కానుంది. జియో ఫైబర్ దెబ్బకు ఇతర పోటీదారులైన బ్రాడ్ బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లు తమ యూజర్లను ఆకర్షించేందుకు చౌకైన ధరకే డేటా ప్లాన్ ఆఫర్లు గుప్పిస్తున్నాయి.
ఎయిర్ టెల్ వి-ఫైబర్, టాటా స్కై, హత్ వే సర్వీసు ప్రొవైడర్లలో గట్టి పోటీ నెలకొంది. మిగతా ప్రొవైడర్ల కంటే ముందుగానే Hathway జియోకు పోటీగా తమ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేసుకున్న నగరాల్లో రూ.399, రూ.699 డేటా ప్లాన్లను 100Mbps స్పీడ్ డేటా, 50Mbps స్పీడ్ డేటాను ఆఫర్ చేస్తోంది. రిలయన్స్ జియో ఇప్పటికే అతి చౌకైన డేటా ప్లాన్ నెలకు రూ.700కే 100Mbps స్పీడ్ ఆఫర్ చేస్తోంది.
జియో ఫైబర్ అందించే అత్యధిక డేటా ప్లాన్ ధర నెలకు రూ.10వేలతో 1Gbps స్పీడ్ డేటా ఆఫర్ చేస్తోంది. జయో ఫైబర్ పోటీని తట్టుకునేందుకు Hathway సర్వీసు కూడా నెలకు రూ.699 డేటాప్లాన్ పై 100Mbps ఫ్రీడమ్ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. దీనిపై 1TB వరకు డేటా కెపాసిటీ అందించనుంది. మరో డేటా ప్లాన్ నెలకు రూ.399 ధరపై 50Mbps స్పీడ్ డేటా ఆఫర్ చేస్తోంది.
ఇందులో FUP డేటా లిమిట్ లేదు. దీంతో కస్టమర్లు అన్ లిమిటెడ్ డేటాను ఎలాంటి షరతులు లేకుండా పొందవచ్చు. హాత్ వే సర్వీసు అందించే నెలవారీ డేటాప్లాన్లలో రూ.1,499 ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్ పై 150Mbps స్పీడ్ తో పాటు 1TB వరకు FUP డేటా లిమిట్ ఆఫర్ చేస్తోంది. టెలికమ్ టాక్ కథనం ప్రకారం.. Hathway బ్రాడ్ బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్ చెన్నై నగరంలో నెలకు రూ.949 ధరపై100Mbps స్పీడ్ ఆఫర్ చేస్తోంది. అదేవిధంగా నెలకు రూ.9వేల 999 ధరపై 6 నెలల పాటు 300Mbps ప్లాన్ తో 2TB FUP లిమిట్ ఆఫర్ చేస్తోంది.