Royal Enfield Plants : ఐషర్‌ మోటార్స్ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 3 ప్లాంట్లు మూసివేత

ప్రపంచంలోని అతిపెద్ద మోటారుబైక్ మార్కెట్ అయిన ఇండియాలో పాపులర్ బ్రాండ్ రాయల్ ఎన్ ఫీల్డ్ మూడు తయారీ ప్లాంట్లను మూసివేస్తోంది.

Royal Enfield manufacturing Plants : ప్రపంచంలోని అతిపెద్ద మోటారుబైక్ మార్కెట్ అయిన ఇండియాలో పాపులర్ బ్రాండ్ రాయల్ ఎన్ ఫీల్డ్ మూడు తయారీ ప్లాంట్లను మూసివేస్తోంది. మే 27 నుంచి మే 29 వరకు తయారీ ప్లాంట్లను మూసివేయనున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. దీనిపై రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ మూడు తయారీ ప్లాంట్లు దక్షిణ తమిళనాడులోని చెన్నైప్రాంతాల్లో ఉన్నాయి.

మే 13, మే 16 మధ్య రాయల్ ఎన్ ఫీల్డ్ చెన్నైలోని తయారీ కేంద్రాల వద్ద ఉత్పత్తి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. తిరువొట్టియూర్, ఒరాగడమ్, వల్లం వడగల్ సౌకర్యాలలో కంపెనీ తయారీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. తమిళనాడులో అధిక కోవిడ్ -19 కేసుల నేపథ్యంలో, రెనాల్ట్ నిస్సాన్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కూడా తమిళనాడులోని తమ ప్లాంట్లను ఐదు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేసింది. ఇదిలావుండగా, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) చెన్నై ప్లాంట్‌లో మంగళవారం నుంచి ఐదు రోజుల పాటు తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేసింది.

హ్యుందాయ్ యాజమాన్యం 2021 మే 25 నుండి 2021 మే 29 వరకు 5 రోజుల పాటు ప్లాంట్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించినట్టు హెచ్ఎంఐఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. తమిళనాడులో మంగళవారం 34,285 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి, మొత్తం 19,11,496 కు చేరింది. గత 24 గంటల్లో 468 కరోనా మరణాలు నమోదు కాగా ఇప్పటివరకు 21,340 మంది మరణించారు. COVID-19 వ్యాప్తిని నివారించడానికి మే 24 నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. మరో వారం పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు