Royal Enfield New Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ఒకేసారి 3 కొత్త బైకులు.. మార్కెట్ షేక్.. వివరాలు లీక్..

రాయల్ ఎన్‌ఫీల్డ్ రాబోయే సంవత్సరాల్లో సరికొత్త బైక్‌లతో మార్కెట్లో పెద్ద సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది

Royal Enfield Super Meteor 650

Royal Enfield New Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులకు పండగలాంటి వార్త. ఆ కంపెనీ నుంచి త్వరలో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా పలు కొత్త మోడళ్లు మార్కెట్లోకి దూసుకురాబోతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న బైక్‌లకు అప్‌డేట్స్ ఇవ్వడంతో పాటు, పూర్తిగా కొత్త బైక్‌లను, ఎలక్ట్రిక్ మోడళ్లను కూడా సిద్ధం చేస్తోంది. ఇటీవల స్పెయిన్, లద్ధాఖ్‌లో టెస్టింగ్ చేస్తూ కనిపించిన కొన్ని బైక్‌ల ఫొటోలు లీక్‌ అయ్యాయి. రాబోయే ఆ క్రేజీ మోడళ్ల వివరాలు ఇవే..

సూపర్ మీటియోర్ 650

ఇటీవల స్పెయిన్ వీధుల్లో టెస్టింగ్ చేస్తూ కనిపించిన ఈ బైక్, ప్రస్తుత సూపర్ మీటియోర్ 650కి అప్‌డేటెడ్ వెర్షన్. దీని ఇంజిన్‌లో మార్పు లేదు. ఇది కొత్త 750సీసీ బైక్ కాదని, బైక్‌పై ఉన్న ‘650’ డెకల్ స్పష్టం చేస్తోంది. ప్రధాన మార్పు సస్పెన్షన్‌లోనే ఉంది. రైడింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరిచేందుకు వెనుక, ముందు సస్పెన్షన్ సిస్టమ్‌లో మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ అప్‌డేటెడ్ మోడల్ 2026 నాటికి మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

Also Read: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కంబ్యాక్ మ్యాచులు.. డేట్లు, వేదికలను ప్రకటించిన బీసీసీఐ..

పవర్‌ఫుల్ అడ్వెంచర్ బైక్ – హిమాలయన్ 750

అడ్వెంచర్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హిమాలయన్ 750 కూడా లద్ధాఖ్‌లో టెస్టింగ్‌లో కెమెరాకు చిక్కింది. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ఇది రానుంది. డ్యూయల్ ఫ్రంట్ డిస్క్ బ్రేకులు, సరికొత్త సస్పెన్షన్ సెటప్‌తో ఇది చాలా శక్తిమంతంగా ఉండబోతోంది. ఆఫ్‌రోడింగ్‌కు ప్రత్యేకంగా ఉంటుంది. దీని డిజైన్, ఫీచర్లు కఠినమైన రోడ్లపై ప్రయాణించడానికి అనువుగా ఉన్నాయి.

హిమ్-ఈ

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన తొలి ఎలక్ట్రిక్ ఆఫ్‌రోడ్ బైక్‌ను కూడా సిద్ధం చేస్తోంది. ‘హిమ్-ఈ’ (HIM-E) పేరుతో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ హిమాలయన్ మోడల్ ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉంది. ఇది బ్రాండ్ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ అడ్వెంచర్ బైక్ కానుంది.

ఈ మూడు మోడళ్లతో పాటు ‘ఫ్లయింగ్ ఫ్లీ’ సబ్-బ్రాండ్ కింద కూడా కొత్త ఉత్పత్తులు రానున్నాయి. మొత్తానికి, రాయల్ ఎన్‌ఫీల్డ్ రాబోయే సంవత్సరాల్లో సరికొత్త బైక్‌లతో మార్కెట్లో పెద్ద సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. అయితే, వీటిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.