Royal Enfield Electric Bike
Royal Enfield Electric Bike : రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానులకు శుభవార్త.. కంపెనీ ఇప్పుడు ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ C6 రిలీజ్ చేయబోతోంది. Q4 FY26 నాటికి మార్కెట్లోకి రావచ్చు. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లో ప్రత్యేకత ఏంటి? ధర ఎంత ఉంటుందో వివరంగా తెలుసుకుందాం.
Read Also : Vivo V27 Pro : వివో ఫోన్ క్రేజే వేరబ్బా.. వివో V27 ప్రో ఎందుకు కొనాలంటే? యువత మెచ్చిన ఫోన్..!
రాయల్ ఎన్‌ఫీల్డ్ C6 :
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎల్లప్పుడూ క్లాసిక్, స్ట్రాంగ్ బైక్‌లకు ప్రసిద్ధి చెందింది. కానీ, ఇప్పుడు కంపెనీ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగంలోకి ప్రవేశిస్తోంది. C6 అనే ఈ బైక్ బ్రాండ్ ఎలక్ట్రిక్ జర్నీ ప్రారంభించడమే కాకుండా ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్‌లో కొత్త ప్రమాణాలను కూడా సెట్ చేయనుంది.
ధర :
ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర విషయానికి వస్తే.. రూ. 1.5 లక్షల నుంచి రూ. 2 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. కంపెనీ ఇంకా అధికారిక ధరను ప్రకటించనప్పటికీ, మార్కెట్ నిపుణులు ఈ రేంజ్ అంచనా వేస్తున్నారు.
ఫీచర్లు :
డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ : స్పీడ్, బ్యాటరీ లెవల్, సింగిల్ స్క్రీన్ డేటా
మల్టీ రైడింగ్ మోడ్‌లు : ఎకో, స్పోర్ట్, నార్మల్ మోడ్‌లతో మెరుగైన రైడింగ్ ఎక్స్‌పీరియన్స్
రీజనరేటివ్ బ్రేకింగ్ : బ్రేకింగ్ చేసేటప్పుడు బ్యాటరీని రీఛార్జ్ చేసే టెక్నాలజీ
కనెక్టివిటీ ఆప్షన్లు : స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, నావిగేషన్, రియల్ టైమ్ అప్‌డేట్స్.
టాప్ రేంజ్ :
టాప్ రేంజ్ విషయానికి వస్తే.. C6 అధికారిక రేంజ్ ఇంకా వెల్లడి కాలేదు. కానీ, నిపుణులు ఈ బైక్ 120-150 కి.మీ వరకు రేంజ్ అందించగలదని చెబుతున్నారు. ఈ అంచనా సరైనది అయితే.. సిటీ, హైవే రైడింగ్‌కు బెస్ట్ రేంజ్ అందిస్తుంది.
లాంచ్ తేదీ (అంచనా) :
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫస్ట్ ఎలక్ట్రిక్ బైక్‌ను Q4 FY26 నాటికి (జనవరి-మార్చి 2026) లాంచ్ చేయాలని యోచిస్తోంది. కంపెనీ ఇంకా కచ్చితమైన తేదీని రివీల్ చేయలేదు.