Rupee hits new lifetime low against dollar
Rupee: రూపాయి రోజు రోజుకూ బక్క చిక్కుతోంది. డాలర్‌తో రూపాయి విలువ అంతకంతకు పడపోతుంది. శుక్రవారం ట్రేడింగ్‌లో 15 పైసల పతనంతో మరో ఆల్‌టైం కనిష్ట స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి విలువ రూ.82.32 వద్ద ముగిసింది. దేశీయ స్టాక్ మార్కెట్లలో నెగెటివ్ ట్రెండ్‌తో శుక్రవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో రూ.82.19 వద్ద మొదలై ఒకానొక దశలో రూ.82.43 వద్దకు చేరుకుంది. గురువారం తొలిసారి రూపాయి మారకం విలువ రూ.82 మార్క్ స్థాయికి పడిపోయింది.
అమెరికా ఫెడ్ రిజర్వువడ్డీరేట్లు పెంచినా, క్రూడాయిల్ ధర పెరిగినా, యూఎస్ ద్రవ్యోల్బణం ఎక్కువైనా రూపాయి విలువ పతనావస్థలోకి పడిపోతున్నది. రూపాయి పరిస్థితి ఇలా ఉంటే.. ఆరు కరెన్సీల బాస్కెట్‌లో డాలర్ విలువ 0.19 శాతం తగ్గి 112.04కు చేరడం గమనార్హం. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 0.82 శాతం పెరిగి 95.19 డాలర్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురుకు డిమాండ్ బలహీన పడటంతో ఒపెక్ ప్లస్ దేశాల కూటమి క్రూడాయిల్ ఉత్పత్తి తగ్గించాలని నిర్ణయించాయి. అటుపైనే క్రూడాయిల్ ధర పెరగడం గమనార్హం.
Flipkart Big Dussehra Sale: ఐఫోన్-13 కొనుగోలుపై భారీ ఆఫర్.. వివరాలివిగో..