Flipkart Big Dussehra Sale: ఐఫోన్-13 కొనుగోలుపై భారీ ఆఫర్.. వివరాలివిగో..
దసరాకి ముందు ఫ్లిప్‌కార్ట్ నిర్వహించిన బిగ్ బిలియన్ డేస్ సెప్టెంబర్ 30తోనే ముగిసింది. అయితే డిమాండ్‌కు అనుగుణంగా మరో మూడు రోజుల పాటు బిగ్ బిలియన్ డేస్ ఆఫర్లను కొనసాగించేందుకు దసరా పండగ సేల్ నిర్వహిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఇందులో భాగంగా ఐఫోన్-13పై భారీ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ వేరియంటు ఫ్లిప్‌కార్ట్‌లో 59,990 రూపాయలకి అందుబాటులో ఉంది

iPhone 13 under Rs 50,000 at Flipkart Big Dussehra Sale
Flipkart Big Dussehra Sale: దసరాకి ముందు ఫ్లిప్‌కార్ట్ నిర్వహించిన బిగ్ బిలియన్ డేస్ సెప్టెంబర్ 30తోనే ముగిసింది. అయితే డిమాండ్‌కు అనుగుణంగా మరో మూడు రోజుల పాటు బిగ్ బిలియన్ డేస్ ఆఫర్లను కొనసాగించేందుకు దసరా పండగ సేల్ నిర్వహిస్తోంది ఫ్లిప్‌కార్ట్. ఇందులో భాగంగా ఐఫోన్-13పై భారీ ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ వేరియంటు ఫ్లిప్‌కార్ట్‌లో 59,990 రూపాయలకి అందుబాటులో ఉంది. అయితే దీనిని ఈ సేల్‌లో భాగంగా పలు ఆఫర్లతో 50,000 రూపాయల లోపు ధరకు ఫ్లిప్‌కార్ట్ అందించనుంది.
ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్: కస్టమర్‌లు తమ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే రూ.16,900 వరకు తక్షణ క్రెడిట్‌ని ఆస్వాదించవచ్చు. తద్వారా ఐఫోన్-13 ధర రూ.43,000కి తగ్గించవచ్చు. అదే సమయంలో 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐని కూడా ఎంచుకోవచ్చు. అదనంగా, హచ్డీఎఫ్సీ క్రెడిట్, డెబిట్ కార్డ్ హోల్డర్లు ఈఎంఐ లావాదేవీలపై రూ.1,000.. ఈఎంఐ కాని లావాదేవీలపై రూ.500 తగ్గింపును పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
ఫ్లిప్‌కార్ట్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఆఫర్లు: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ 2022 సందర్భంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో కూడా భాగస్వామిగా ఉంది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లను ఉపయోగించే కొనుగోలుదారులు ఏడాది సేల్ సమయంలో 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు. సాధారణంగా ఎంపిక చేసిన బ్యాంకులపై 10 శాతం ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ రూ.1,000కి పరిమితం చేయబడింది. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ డీల్స్, నో-కాస్ట్ ఈఎంఐ, స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను కూడా అందిస్తోంది.
Google Pixel Tablet : టెన్సర్ G2తో గూగుల్ పిక్సెల్ టాబ్లెట్ వస్తోంది.. 2023లో ఎప్పుడైనా రావొచ్చు!