రూ.699 కోట్లు టాక్స్ క‌ట్టిన స‌చిన్ బ‌న్సాల్

  • Published By: veegamteam ,Published On : January 2, 2019 / 06:11 AM IST
రూ.699 కోట్లు టాక్స్ క‌ట్టిన స‌చిన్ బ‌న్సాల్

 ఫ్లిప్ కార్డ్ ఆన్‌లైన్‌ షాపింగ్ సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు స‌చిన్ బ‌న్సాల్ అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించాడ‌ట‌. ఎంత తెలుసా..  ఒక్క‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ.699 కోట్ల టాక్స్ చెల్లించాడ‌ట‌. తొలి త్రైమాసికం 2018-19 సంవ‌త్సరానికిగానూ వ‌చ్చిన ఆదాయంపై స‌చిన్ ఇంత భారీ మొత్తంలో ట్యాక్స్ చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. ఇటీవ‌ల‌ స‌చిన్ త‌న ఆదాయ వివ‌రాల‌ను వెల్ల‌డించాల్సిందిగా ఆదాయ ప‌న్ను శాఖ నోటీసులు జారీ చేసింది. స‌చిన్ తో పాటు ఫ్లిప్ కార్ట్‌ స‌హా వ్య‌వ‌స్థాప‌కుడు బిన్ని బ‌న్సాల్ కు కూడా ఐటీ శాఖ‌ నోటీసులు జారీ చేసింది.  త‌మ సంస్థ ఫ్లిప్ కార్ట్ వాటాను యూఎస్ రిటైల్ దిగ్గ‌జం వాల్ మార్ట్ విక్ర‌యించడంతో వీరిద్ద‌రూ అధిక లాభాలను ఆర్జించారు. వీరితో పాటు ఫ్లిఫ్ కార్ట్ లో వాటాలు క‌లిగి ఉన్నమ‌రో 35 మంది షేర్ హోల్డ‌ర్ల‌కు కూడా నోటీసులు పంపింది. స‌చిన్, బిన్ని బ‌న్సాల్ ఇద్ద‌రు  ఫ్లిప్ కార్డ్ సంస్థ లో 5 శాతం వాటాను క‌లిగి ఉన్న సంగ‌తి తెలిసిందే. ఐటీ శాఖ ఆదేశాల‌తో స‌చిన్ తన ఆదాయాన్ని ఐటీ శాఖ‌కు వెల్ల‌డించ‌గా.. బిన్నీ బ‌న్సాల్ త‌న ఆదాయ వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించాల్సి ఉంది. వాల్మార్ట్ రంగ ప్ర‌వేశం చేసిన త‌ర్వాత‌, ఆ సంస్థ‌కు వీరిద్ద‌రిని వాటాల‌ను ద‌క్కించుకున్నారు. మే 9న వాల్మార్ట్ హోల్డింగ్స్, ఫ్లిప్ కార్డ్ సింగ‌పూర్ మ‌ధ్య జ‌రిగిన ఫేర్ ప‌ర్చేజ్ అగ్రిమెంట్ ద్వారా ఫ్లిప్ కార్డ్ సంస్థ‌లో 77 శాతం వాటాను వాల్మార్ట్ ద‌క్కించుకుంది. ఇందుకోసం ఆ సంస్థ  16 బిలియ‌న్ డాల‌ర్లను ఖ‌ర్చు పెట్టింది. ఫ్లిప్ కార్డ్ లో 46 మంది షేర్ హోల్డ‌ర్ల వివ‌రాలు, కొనుగొలు ఒప్పందం ద్వారా వారికి ల‌భించిన ఆదాయం వివ‌రాలు కూడా వెల్ల‌డించాల‌ని ఆదాయ‌పు ప‌న్ను శాఖ కొద్ది రోజుల క్రితమే వాల్మార్ట్ కూడా నోటీసులు జారీ చేసింది.