Samsung Galaxy A36 5G
Samsung Galaxy A36 5G : శాంసంగ్ ఫోన్లలో మంచి డిజైన్, బ్యాటరీ లైఫ్, కెమెరా సెటప్ కలిగిన ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, మీకోసం శాంసంగ్ గెలాక్సీ A36 5G ఫోన్ (Samsung Galaxy A36 5G) అందుబాటులో ఉంది. ఫొటోలు, వీడియోల కోసం స్క్రీన్ క్వాలిటీ కలిగిన ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ ఫోన్.
ప్రస్తుతం అమెజాన్‌లో ఈ శాంసంగ్ గెలాక్సీ A36 5G ఫోన్ భారీ తగ్గింపు ధరకు లభిస్తోంది. ఈ ఫోన్ ధర రూ. 24వేలు లోపు అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చింది. ఆండ్రాయిడ్ 15 ప్రీ-ఇన్‌స్టాల్ అయింది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ A36 డీల్ :
శాంసంగ్ గెలాక్సీ A36 ప్రారంభ ధర రూ.32,999పై రూ.9,279 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ శాంసంగ్ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో కేవలం రూ.24,970కే జాబితా అయింది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.1,250 బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.23,300 వరకు సేవ్ చేసుకోవచ్చు. అయితే మీ ఫోన్ మోడల్, వర్కింగ్ కండిషన్ ఆధారంగా ఎక్స్ఛేంజ్ వాల్యూ ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ A36 స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ A36 5G ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1,900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.7-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ అడ్రినో 710 GPUతో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 (6nm)తో వస్తుంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజీని అందిస్తుంది.
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది. 6 జనరేషన్ల వరకు ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లు, 6 ఏళ్ల సేఫ్టీ అప్‌డేట్స్ అందుకుంటుంది. ఈ శాంసంగ్ ఫోన్ 5000mAh బ్యాటరీతో 45W ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ A55 5G ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సింగిల్ 12MP సెన్సార్‌ను కలిగి ఉంటుంది.