Motorola G86 5G : పిచ్చెక్కించే ఫీచర్లతో కొత్త మోటోరోలా G86 వచ్చేస్తోందోచ్.. కెమెరాలు భలే ఉన్నాయి.. ధర ఎంత ఉండొచ్చంటే?
Motorola G86 5G : మోటోరోలా G86 5G ఫోన్ లాంచ్ టైమ్‌లైన్, ధర, స్పెసిఫికేషన్లకు సంబంధించి లేటెస్ట్ లీక్‌లు ఇలా ఉన్నాయి.. ఓసారి లుక్కేయండి..

Motorola G86 5G
Motorola G86 5G : మోటోరోలా నుంచి సరికొత్త 5G ఫోన్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లోకి మోటోరోలా G సిరీస్ విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాబోయే ఈ కొత్త మోటో G86 స్మార్ట్‌ఫోన్ (Motorola G86 5G) గత ఏడాదిలో వచ్చిన మోటో G85 5Gకు అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ ఫోన్ లాంచ్‌కు సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక వివరాలను వెల్లడించలేదు.
ఈ హ్యాండ్‌సెట్ ఇటీవలే BIS సర్టిఫికేషన్ సైట్‌లో మోడల్ నంబర్ (XT2527-5)తో కనిపించింది. త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ మోటో G86 ఫోన్ కీలక స్పెసిఫికేషన్లు, ఇతర వివరాలు కూడా లీక్ అయ్యాయి.
మోటోరోలా G86 5G లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) :
మోటోరోలా G86 5G ఫోన్ BIS సర్టిఫికేషన్ సైట్‌లో లిస్టింగ్ అయింది. అతి త్వరలో భారత మార్కెట్లో ఈ ఫోన్ లాంచ్ కావచ్చు. కంపెనీ ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీని రివీల్ చేయలేదు. నివేదికల ప్రకారం.. వచ్చే జూలైలో మోటో G86 లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.
Read Also : Home Loans : హోం లోన్ తీసుకుంటున్నారా? SBI నుంచి PNB వరకు తక్కువ వడ్డీ రేట్లు అందించే టాప్ 5 బ్యాంకులివే..!
మోటోరోలా G86 5G స్పెసిఫికేషన్లు (అంచనా) :
మోటో G86 5G ఫోన్ 6.67-అంగుళాల 1.5K కర్వ్డ్ pOLED ప్యానెల్‌ను 120Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంటుందని అంచనా. ఈ హ్యాండ్‌సెట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ కూడా రావచ్చు. హుడ్ కింద, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoCతో వచ్చే అవకాశం ఉంది. 12GB వరకు ర్యామ్, 256GB వరకు స్టోరేజీతో వస్తుంది.
ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. మోటో G86 5G ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 50MP సోనీ IMX766 ప్రైమరీ షూటర్, బ్యాక్ సైడ్ 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో రావచ్చు. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP సెల్ఫీ కెమెరా ఉండవచ్చు. అదనంగా, ఈ మోటోరోలా ఫోన్ 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,100mAh బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. మోటో G86 ఆండ్రాయిడ్ 15 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌లో రన్ కావచ్చు.
మోటోరోలా G86 5G ధర (అంచనా) :
నివేదికల ప్రకారం.. రాబోయే మోటో G86 5G ఫోన్ బేస్ మోడల్ ధర దాదాపు రూ. 20వేలు ఉండవచ్చు. ఇతర స్టోరేజీ ఆప్షన్ల ధర కూడా రూ. 25వేల లోపు ధరలో ఉండే అవకాశం ఉంది.