Home Loans : హోం లోన్ తీసుకుంటున్నారా? SBI నుంచి PNB వరకు తక్కువ వడ్డీ రేట్లు అందించే టాప్ 5 బ్యాంకులివే..!

Home Loans : హోం లోన్లు తీసుకునేవారికి అతి తక్కువ వడ్డీకే లోన్లు అందించే బ్యాంకులు ఇవే.. ఎస్బీఐ నుంచి పీన్‌బీ వరకు టాప్ 5 బ్యాంకుల వివరాలను ఓసారి లుక్కేయండి..

Home Loans : హోం లోన్ తీసుకుంటున్నారా? SBI నుంచి PNB వరకు తక్కువ వడ్డీ రేట్లు అందించే టాప్ 5 బ్యాంకులివే..!

Home Loans

Updated On : June 12, 2025 / 1:01 PM IST

Home Loans : హోం లోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్.. ఇప్పుడు బ్యాంకుల్లో గృహ రుణాలను తక్కువ వడ్డీ రేట్లకే తీసుకోవచ్చు. ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును (Home Loans) తగ్గించిన సంగతి తెలిసిందే. మూడు రోజుల ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం అనంతరం రెపో రేటులో 50-బేసిస్ పాయింట్ల తగ్గింపును ప్రకటించింది. తద్వారా రెపో రేటును 5.5శాతానికి చేరింది.

కీలక రుణ రేటు తగ్గింపుతో అనేక బ్యాంకులు లోన్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తున్నాయి. లోన్లు తీసుకునే వారికి తక్కువ వడ్డీ రేటుకే అందిస్తాయని భావిస్తున్నారు. రెపో రేటు తగ్గింపు తర్వాత బ్యాంకులు ఆర్బీఐ నుంచి తక్కువ వడ్డీకే అప్పు తీసుకోవచ్చు. రెపో రేటు తగ్గింపు తర్వాత చాలావరకు ఫైన్సాన్స్ సంస్థలు, బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరించాయి.

Read Also : Samsung Galaxy S24 : శాంసంగ్ ప్రియులకు బిగ్ డీల్.. అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ధర జస్ట్ ఎంతంటే? డోంట్ మిస్!

హోం లోన్లు, పర్సనల్ లోన్లు సహా అన్నీ రుణాలు చౌకగా లభిస్తాయి. ముఖ్యంగా గృహ కొనుగోలుదారులు గృహ రుణ వడ్డీ రేట్లలో భారీ ఉపశమనం పొందే అవకాశం ఉంది. గత ఏప్రిల్‌లో రెపో రేటును 6 శాతానికి తగ్గించిన తర్వాత ఆర్బీఐ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. గతంలో తగ్గింపుతో అనేక బ్యాంకులు తమ ఫ్లోటింగ్-రేటు రుణ వడ్డీ రేట్లను సవరించాయి.

ఫలితంగా గృహ రుణాల నెలవారీ ఈఎంఐ (EMI)లు తగ్గాయి. ఫ్లోటింగ్ రేట్ రుణం కాలక్రమేణా మారుతున్న వడ్డీ రేటును కలిగి ఉంటుంది. రెపో రేటు బెంచ్‌మార్క్ రుణ రేటులో మార్పులతో ముడిపడి ఉంటుంది.

ఆర్బీఐ ప్రకటనతో.. రిటైల్ రుణ రేట్లు మరింత తగ్గుతాయని, ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని భావిస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)తో సహా ఇతర ఫైనాన్స్ సంస్థలు ఇంకా వడ్డీ రేట్లలో సవరణను ప్రకటించలేదు. కానీ, మరికొన్ని బ్యాంకులు ఇప్పటికే వడ్డీ రేట్లను తగ్గించాయి.

చౌకగా గృహ రుణ వడ్డీ రేట్లు (Home Loans) :
గృహ రుణ వడ్డీ రేట్లు బ్యాంకు నుంచి బ్యాంకుకు మారుతూ ఉంటాయి. వడ్డీ రేట్ల తగ్గింపు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందించే బ్యాంకులు సాధారణంగా క్రెడిట్ హిస్టరీ, CIBIL స్కోరు, రుణగ్రహీత వృత్తి, ఇతర ఆర్థిక వివరాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయి. గృహ రుణ వడ్డీ రేట్లు రుణ మొత్తం, మొత్తం కాలపరిమితి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

1. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : వడ్డీ రేటు ( 8.00 శాతం నుంచి 8.95 శాతం వరకు)
అర్హత : CIBIL స్కోరు ఆధారంగా

2. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర : వడ్డీ రేటు ( 7.85 శాతం నుంచి 7.95 శాతం వరకు)
అర్హత : జీతం పొందేవారు, జీతం లేనివారు, CIBIL స్కోరు 800+ ఉండాలి.

3. పంజాబ్ నేషనల్ బ్యాంకు : (Home Loans) వడ్డీ రేటు ( 8.00 శాతం నుంచి )
అర్హత : CIBIL స్కోరు 800+, లోన్ వాల్యూ రూ. 30 లక్షలకు పైగా

4. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా : వడ్డీ రేటు ( 7.85 శాతం నుంచి )
అర్హత : జీతం పొందేవారు, జీతం లేనివారు ఇద్దరూ, CIBIL స్కోరు 800+, లోన్ వాల్యూ ఆధారంగా

5. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా : వడ్డీ రేటు ( 7.85 శాతం నుంచి 8.75 శాతం వరకు )
అర్హత : సెంట్ గృహ లక్ష్మి పథకం’ కింద రుణంలో మహిళ ఒక్కరే మొదటి రుణగ్రహీతగా ఉండాలి

ప్రస్తుతం బ్యాంకులు సంవత్సరానికి 7.85 శాతం నుంచి గృహ రుణ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ 8 శాతం కన్నా తక్కువ వడ్డీ రేటుకు గృహ రుణాలను అందిస్తున్నాయి.

Read Also : Vivo T4 Ultra vs T3 Ultra : వివో ఫోన్లలో ఏది కొంటే బెటర్.. వివో T3 అల్ట్రా కన్నా కొత్త T4 అల్ట్రా బెటరా? మీరే డిసైడ్ చేసుకోండి..!

మరోవైపు, యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులు 8 శాతం కన్నా ఎక్కువ వడ్డీ రేటుకు రుణాలను అందిస్తున్నాయి. బ్యాంకులు అందించే వడ్డీ రేట్లు సాధారణ పరిధితో ఉంటాయి. మీ గృహ రుణంపై నిర్దిష్ట రేటు, ఉద్యోగం, ఆదాయం, క్రెడిట్ హిస్టరీ, లోన్ కాలపరిమితి వంటి వివిధ అంశాల ఆధారంగా మారుతాయని గమనించాలి.