Samsung Galaxy S24 5G : బిగ్ డిస్కౌంట్.. అతి చౌకైన ధరకే శాంసంగ్ 5G ఫోన్.. ఏకంగా రూ. 37వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్..!

Samsung Galaxy S24 5G : ఈ శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ భారీగా తగ్గిందోచ్.. రూ. 80వేల ఫోన్ కేవలం రూ. 43,420కే లభ్యమవుతుంది.

Samsung Galaxy S24 5G : బిగ్ డిస్కౌంట్.. అతి చౌకైన ధరకే శాంసంగ్ 5G ఫోన్.. ఏకంగా రూ. 37వేలు డిస్కౌంట్.. డోంట్ మిస్..!

Samsung Galaxy S24 5G

Updated On : June 24, 2025 / 6:33 PM IST

Samsung Galaxy S24 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ప్రీమియం ఫీచర్లతో కాంపాక్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే మీకోసం అద్భుతమైన 5G ఫోన్ (Samsung Galaxy S24 5G) తక్కువ ధరకే లభిస్తోంది.

ప్రస్తుతం అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 5G ఫోన్ రూ.37వేల కన్నా తగ్గింపుతో అందుబాటులో ఉంది. 2024లో రూ.79,999కి లాంచ్ అయిన వన్‌ప్లస్ 13R కన్నా తక్కువ ధరకు పొందవచ్చు. కొంచెం పాత మోడల్ అయినప్పటికీ గెలాక్సీ S24 5G చిప్‌సెట్, కెమెరాలు, క్లీన్ యూఐతో మరింతగా ఆకట్టుకునేలా ఉంది.

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 5G డీల్ :
ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ S24 5G ధర రూ.43,420కి అందుబాటులో ఉంది. అసలు లాంచ్ ధర రూ.79,999 నుంచి తగ్గింది. ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.36,579 తగ్గింది. కస్టమర్లు ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రూ.1,250 బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ధర రూ.42,170 వరకు తగ్గుతుంది.

Read Also : Tecno Spark Go 2 : AI ఫీచర్లతో టెక్నో కొత్త స్మార్ట్‌ఫోన్ అదుర్స్.. నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ చేయొచ్చు.. ధర కూడా చాలా తక్కువే..!

అదనంగా, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు 5 శాతం క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. నెలకు రూ.2,105 నుంచి ఈఎంఐ, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ల మధ్య కూడా ఎంచుకోవచ్చు. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ కోసం బ్రాండ్, మోడల్, వేరియంట్ ఆధారంగా రూ.41,150 వరకు ట్రేడ్-ఇన్ వాల్యూను పొందవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ S24 5G స్పెసిఫికేషన్లు (Samsung Galaxy S24 5G) :
శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ 6.2-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ ఎక్సినోస్ 2400 చిప్‌సెట్, 8GB వరకు ర్యామ్, 512GB వరకు స్టోరేజీ సపోర్టు ఇస్తుంది. 25W ఛార్జింగ్‌తో 4,000mAh బ్యాటరీని అందిస్తుంది.

కెమెరా విషయానికొస్తే.. ఈ హ్యాండ్‌సెట్ 50MP ప్రైమరీ షూటర్, 12MP అల్ట్రావైడ్, 10MP టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. అదనంగా, ఆండ్రాయిడ్ 15-ఆధారిత వన్ యూఐ 7పై రన్ అవుతుంది. రాబోయే నెలల్లో ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్‌ను అందుకోనుంది. ఈ శాంసంగ్ ఫోన్ చాట్ అసిస్ట్, నోట్ అసిస్ట్, నౌ బ్రీఫ్, సర్కిల్ టు సెర్చ్, ఇతర ఏఐ ఫీచర్లను కూడా కలిగి ఉంది.