Samsung Galaxy S24 FE 5G : అమెజాన్ బంపర్ ఆఫర్.. కొంటే ఇలాంటి శాంసంగ్ 5G ఫోన్ కొనాలి భయ్యా.. ఎందుకంటే?

Samsung Galaxy S24 FE 5G : అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 FE 5G ఫోన్ ధర తగ్గిందోచ్.. ఎంత తగ్గిందో తెలిస్తే కొనకుండా ఆగలేరు..

Samsung Galaxy S24 FE 5G

Samsung Galaxy S24 FE 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ S24 FE 5G ఫోన్ రూ. 59,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఈ ఫ్యాన్ ఎడిషన్ (Samsung Galaxy S24 FE 5G) స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు అమెజాన్ ద్వారా తగ్గింపు ధరకు అందుబాటులో ఉంది.

128GB స్టోరేజ్ వేరియంట్ ప్రస్తుతం రూ. 40వేల మార్క్ కన్నా తక్కువ ధరకు లభ్యమవుతుంది. కొనుగోలుదారులు అదనపు ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో ఎంచుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S24 FE ఎక్సినోస్ 2400e చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 4,700mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ S24 FE ధర తగ్గింపు :
అమెజాన్ గెలాక్సీ S24 FE ఫోన్ బేస్ మోడల్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ. 35,655కు లభిస్తోంది. అసలు లాంచ్ ధర రూ. 59,999 నుంచి తగ్గింది. 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ మోడల్ అసలు ధర రూ. 65,999 నుంచి రూ. 43,300కు తగ్గింది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులు, ఈఎంఐల కొనుగోళ్లపై రూ. 1,250 వరకు డిస్కౌంట్ అందిస్తుంది.

Read Also : SIP Calculator : SIPలో నెలకు రూ. 14వేల పెట్టుబడితో ఎన్ని ఏళ్లలో రూ.13 కోట్లకు పైగా సంపాదించవచ్చంటే? ఫుల్ డిటెయిల్స్..!

ఫలితంగా, ఈ ఫోన్ ధర రూ. 34,405కి తగ్గుతుంది. నెలకు రూ. 1,729 నుంచి 6 నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందిస్తోంది. ఇంకా, అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు రూ. 1,069 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ ప్రస్తుతం గెలాక్సీ S24 FE బేస్ వేరియంట్‌ ధర రూ. 59,999కు విక్రయిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 39,999కు లిస్ట్ అయింది.

శాంసంగ్ గెలాక్సీ S24 FE స్పెసిఫికేషన్లు (Samsung Galaxy S24 FE 5G) :
భారత మార్కెట్లో గత సెప్టెంబర్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 FE బ్లూ, గ్రాఫైట్, మింట్ షేడ్స్‌లో లాంచ్ అయింది. 6.7-అంగుళాల ఫుల్-HD+ (1,080 x 2,340 పిక్సెల్స్) డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిగి ఉంది. 8GB ర్యామ్, 512GB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో ఎక్సినోస్ 2400e SoCపై రన్ అవుతుంది.

ఆప్టిక్స్ విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 FE ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ సెన్సార్, OIS, 3x ఆప్టికల్ జూమ్‌తో 8MP టెలిఫోటో షూటర్, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంది. 10MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. IP68-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. 25W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 4,700mAh బ్యాటరీని కలిగి ఉంది.