Samsung Galaxy S24 FE
Samsung Galaxy S24 FE : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌కు ముందే శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ భారీగా తగ్గింది. గత ఏడాదిలో గెలాక్సీ S24 ఎఫ్ఈ అద్భుతమైన (Samsung Galaxy S24 FE) ఫీచర్లు కలిగి ఉంది. మీరు శాంసంగ్ అభిమాని అయితే ఇదే సరైన సమయం. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌కు కొన్ని గంటల ముందు శాంసంగ్ గెలాక్సీ S24 FE ప్లాట్‌ఫామ్‌పై 50 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇంతకీ, ఈ శాంసంగ్ 5G ఫోన్ కొనుగోలు చేసే ముందు స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను ఓసారి పరిశీలిద్దాం.
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ 5G డీల్ :
శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ 5G ఫోన్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌కు ముందే భారీ తగ్గింపు పొందింది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో 8GB RAM వేరియంట్ అసలు లాంచ్ ధర రూ.59,999 కన్నా తగ్గి కేవలం రూ.29,999కే అందుబాటులో ఉంది.అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కలిగిన యూజర్లు రూ.4వేల వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ శాంసంగ్ ఫోన్ బ్లూ, గ్రాఫైట్, మింట్ అనే 3 వేర్వేరు కలర్ ఆప్షన్లలో పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 FE ఫోన్ 6.7-అంగుళాల డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కలిపి 1900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. పైన వన్ యూఐ 6.1 స్కిన్‌తో కూడిన ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్, శాంసంగ్ 7 ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్‌లతో రూపొందింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లిప్స్ 940 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్‌తో ఎక్సినోస్ 2400e ప్రాసెసర్‌పై రన్ అవుతుంది.
ఆప్టిక్స్ విషయానికొస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 ఎఫ్ఈ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ షూటర్, 123 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్, OIS, 3X ఆప్టికల్ జూమ్‌తో 8MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ శాంసంగ్ ఫోన్‌లో 10MP ఫ్రంట్ స్నాపర్ కూడా ఉంది. 4700mAh బ్యాటరీతో పాటు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.