Telugu » Business » Samsung Galaxy S24 Ultra 5g Price Drops By Over Rs 25000 On Flipkart Ahead Of Galaxy S26 Ultra Launch Sh
Samsung Galaxy S24 Ultra 5G : శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ధర తగ్గిందోచ్.. ఈ అద్భుతమైన డీల్ మీకోసమే.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy S24 Ultra 5G : శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5జీ ఫోన్ ధర తగ్గిందోచ్.. శాంసంగ్ గెలాక్సీ S26 అల్ట్రా లాంచ్ కన్నా అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Samsung Galaxy S24 Ultra 5G : కొత్త శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? మీకోసం అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. మీరు కొనాలని అనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి. ఎందుకంటే.. 2026లో స్మార్ట్‌ఫోన్లు ఖరీదైనవిగా మారనున్నాయి. మీ ప్రస్తుత ఫోన్ కొత్త శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాతో అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకుంటే ఇదే సరైన సమయం. మీరు ఇలా కొనుగోలు చేస్తే మీరు కొనబోయే శాంసంగ్ 5జీ ఫోన్ రూ. 20వేల కన్నా ఎక్కువ సేవ్ చేయవచ్చు.
2/6
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ అసలు ధర రూ.1,34,999గా ఉండగా ఇప్పుడు తగ్గింపు ధరకే ఇంటికి తెచ్చుకోవచ్చు. రిటైల్ స్టోర్‌లలో ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.1,19,999 చెల్లించాలి. అయితే, ఫ్లిప్‌కార్ట్ యూజర్లు అన్ని బ్యాంక్ డిస్కౌంట్లతో దాదాపు రూ.95వేలకు సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G ధర డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
3/6
ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ అల్ట్రా 5G ధర ఎంతంటే? : ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ రూ.99,989కి అమ్ముడవుతోంది. మీరు ఈ శాంసంగ్ ఫోన్‌పై రూ.20వేల కన్నా ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్ లేదా ఎస్బీఐ ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డులతో మీరు రూ.4వేలు తగ్గింపు కూడా పొందవచ్చు. తద్వారా ధర దాదాపు రూ.95,989కి తగ్గుతుంది. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే దాదాపు రూ.68వేల వరకు తగ్గింపు పొందవచ్చు. వాల్యూ, వర్కింగ్ కండిషన్, బ్రాండ్, మోడల్, మీ ఫోన్ సంబంధించిన ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
4/6
కస్టమర్లు అవసరాన్ని బట్టి బ్యాంక్ కార్డులతో నెలకు రూ.3,516 నుంచి ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు. అయితే, ప్రాసెసింగ్ ఛార్జీలు ఇతర హిడెన్ ఛార్జీలు వర్తించవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు అదనపు మొత్తాన్ని చెల్లించడం ద్వారా ఎక్స్‌టెండెడ్ వారంటీ, ఇతర యాడ్-ఆన్‌లను కూడా పొందవచ్చు.
5/6
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G స్పెసిఫికేషన్లు : శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ డిస్‌ప్లేతో పాటు 120Hzతో 6.8-అంగుళాల QHD+ అమోల్డ్ ప్యానెల్‌తో వస్తుంది. మల్టీ టాస్కింగ్ కోసం అద్భుతమైన ఫీచర్లను అందిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ద్వారా పవర్ పొందుతుంది.
6/6
12GB RAMతో వస్తుంది. 5,000mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్ కలిగి ఉంది. కెమెరా విషయానికొస్తే.. ఈ శాంసంగ్ ఫోన్ 200MP మెయిన్ కెమెరాతో పాటు 50MP పెరిస్కోప్, 10MP టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రావైడ్ లెన్స్ అందిస్తుంది.