Samsung Galaxy S24 Ultra
Samsung Galaxy S24 Ultra : అమెజాన్ ప్రైమ్ డే సేల్ మొదలైంది.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ (Samsung Galaxy S24 Ultra) కూడా భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ధర రూ. 75వేల లోపు అందుబాటులో ఉంది.
ప్రీమియం ఫీచర్లు, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్, అద్భుతమైన కెమెరాలతో గెలాక్సీ S24 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయొచ్చు. అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2025 జూలై 12న ప్రారంభమైంది. జూలై 14 వరకు అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా 5G కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ డీల్..
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా డీల్ :
అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ (12GB + 256GB వేరియంట్) ప్రస్తుతం రూ.74,999కు అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ అసలు ధర రూ.1,29,999 నుంచి రూ.55వేల భారీ తగ్గింపు పొందింది. మీరు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా 5శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. పాత స్మార్ట్‌ఫోన్ రూ.43,900 ఎక్స్ఛేంజ్ వాల్యూతో మరింత తగ్గింపు పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా స్పెసిఫికేషన్లు :
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫోన్ 6.8-అంగుళాల QHD+ డైనమిక్ అమోల్డ్ 2X డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్, 2,600 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. హుడ్ కింద, ఈ ప్రీమియం ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. లైవ్ ట్రాన్స్‌లేట్, సర్కిల్ టు సెర్చ్, నోట్ అసిస్ట్ వంటి గెలాక్సీ ఏఐ ఫీచర్లతో వస్తుంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా బ్యాక్ సైడ్ క్వాడ్-కెమెరా సెటప్ ఉంది. 200MP మెయిన్ సెన్సార్, 50MP 5x టెలిఫోటో లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 10MP 3x ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరా ఉంది. ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో వస్తుంది.