Samsung Galaxy S25 : ఇది కదా ఆఫర్ అంటే.. ఈ శాంసంగ్ ఫోన్లను ప్రీ-ఆర్డర్ చేస్తే.. ఫ్రీగా స్టోరేజీ అప్‌గ్రేడ్, మరెన్నో బెనిఫిట్స్.. డోంట్ మిస్!

Samsung Galaxy S25 : రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్లను ప్రీ-ఆర్డర్ చేసే కస్టమర్‌లు కేవలం హై స్టోరేజ్ వేరియంట్‌లకు ఫ్రీగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

Samsung Galaxy S25 : ఇది కదా ఆఫర్ అంటే.. ఈ శాంసంగ్ ఫోన్లను ప్రీ-ఆర్డర్ చేస్తే.. ఫ్రీగా స్టోరేజీ అప్‌గ్రేడ్, మరెన్నో బెనిఫిట్స్.. డోంట్ మిస్!

Samsung Galaxy S25

Updated On : January 22, 2025 / 5:47 PM IST

Samsung Galaxy S25 Series : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు చూస్తు్న్నారా? అయితే, ఇది మీకోసమే.. ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి గెలాక్సీ S25 సిరీస్ నేడు (జనవరి 22) కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో జరిగే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్‌లో లాంచ్ అవుతుంది.

Read Also : Netflix Plan Prices : అయ్య బాబోయ్.. నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ల ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ దేశాల్లోని యూజర్లు ఎక్కువ చెల్లించాల్సిందే..!

కొత్త నివేదిక ప్రకారం.. రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్లను ప్రీ-ఆర్డర్ చేసే కస్టమర్‌లు కేవలం హై స్టోరేజ్ వేరియంట్‌లకు ఫ్రీగా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అలాగే మరెన్నో బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా గెలాక్సీ ఎస్25 మోడల్స్‌తో పాటు కాంప్లిమెంటరీ ఛార్జర్‌ను కంపెనీ ఆఫర్ చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా, శాంసంగ్ గెలాక్సీ S25 ప్రీ-ఆర్డర్‌లను భారత్, ఇతర ప్రాంతాలలో గ్లోబల్ లాంచ్‌కు ముందే ప్రారంభించింది.

శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ ప్రీ-ఆర్డర్ బెనిఫిట్స్ :
ఫ్రెంచ్ పబ్లికేషన్ డీలాబ్స్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం.. శాంసంగ్ తన రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌కు ముందే ప్రీ-ఆర్డర్ బెనిఫిట్స్ లీక్ చేసింది. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం హై స్టోరేజీ కాన్ఫిగరేషన్ మోడల్‌లను ప్రీ-రిజర్వ్ చేసే కస్టమర్‌లకు ఉచితంగా అప్‌గ్రేడ్ చేసే ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉంది. 128GB మోడల్‌ను కొనుగోలు చేసే కొనుగోలుదారులు 256GB స్టోరేజ్ వేరియంట్‌కి అప్‌గ్రేడ్‌ని పొందేందుకు అర్హులు.

Samsung Galaxy S25

Samsung Galaxy S25

కానీ, ఈ ఏడాదిలో ఇతర బెనిఫిట్స్ కూడా ఉండవచ్చు. గెలాక్సీ S25 లైనప్‌లోని కొత్త మోడల్‌ల కోసం యూజర్లు పాత డివైజ్‌లను ఎక్స్ఛేంజ్ చేసుకునే కస్టమర్‌లకు శాంసంగ్ మెరుగైన ట్రేడ్-ఇన్ వాల్యూను అందించగలదని నివేదిక పేర్కొంది. అదనంగా, ప్రీ-ఆర్డర్‌లతో పాటు ఫ్రీ ఛార్జర్ కూడా సొంతం చేసుకోవచ్చు. సాధారణంగా టెక్ కంపెనీలు బాక్స్‌లో ఛార్జర్‌ను అందించడం లేదు. శాంసంగ్ 2021లో గెలాక్సీ S21 సిరీస్‌ మాదిరిగా ప్రస్తుతానికి, శాంసంగ్ కొనుగోలుదారులు గెలాక్సీ డివైజ్ కొనుగోలు చేసిన తర్వాత USB టైప్-C కేబుల్‌ను మాత్రమే పొందుతారు.

శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ ధర ఎంతంటే? :
శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ ధర 128GB మోడల్‌కు EUR 899 (సుమారు రూ. 81వేలు) నుంచి ప్రారంభం కావచ్చని నివేదిక తెలిపింది. శాంసంగ్ అంచనా వేసిన ప్రీ-ఆర్డర్ ఆఫర్‌లతో అదే ధర 256GB స్టోరేజ్ వేరియంట్‌కి కూడా వర్తిస్తుంది. అదే సమయంలో, గెలాక్సీ S25+, గెలాక్సీ S25 అల్ట్రా మోడల్ బేస్ 256GB స్టోరేజ్ వేరియంట్‌ల ధర వరుసగా EUR 1,169 (దాదాపు రూ. 1,05,000), EUR 1,469 (దాదాపు రూ. 1,32,000)గా నివేదించింది.

Read Also : Airtel Prepaid Plans : ఎయిర్‌టెల్ యూజర్లకు బిగ్ షాక్.. ఈ ప్లాన్లపై మొబైల్ డేటా ఫసక్.. కానీ, ఇలాంటి వాళ్లకు లాభం..!